News January 12, 2026
భద్రాద్రి జిల్లాలో 5 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి సమీక్ష నిర్వహించారు. అనంతరం భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు కాగా, సంబంధిత పాఠశాలలకు భూమిని కేటాయించడం జరిగిందన్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి అయిందన్నారు.
Similar News
News February 2, 2026
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ అనుదీప్

మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల సిబ్బందికి తక్షణమే శిక్షణ పూర్తి చేయాలని, కౌంటింగ్ కోసం అవసరమైన సిబ్బందిని సిద్ధం చేయాలని ఆదేశించారు. విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో దుకాణాలు కోల్పోయిన వారి కోసం స్ట్రీట్ వెండర్ జోన్ ఏర్పాటుకు తగిన తీసుకోవాలని సూచించారు.
News February 2, 2026
అనకాపల్లి: పోలీస్ పీజీఆర్ఎస్‌కు 66 ఫిర్యాదులు

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 66 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ తుహీన్ సిన్హా ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిని పరిశీలించారు. 32 భూ తగాదాలు, 3 మోసపూరిత వ్యవహారాలు, 2 కుటుంబ కలహాలు, 29 ఇతర విభాగాలకు చెందినవి ఉన్నాయి. ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను నిర్ధారించి 7 రోజుల్లోగా పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.
News February 2, 2026
జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి: హైకోర్టు

AP: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రోహిత్ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. రమేశ్‌పై ఎలాంటి దాడులు జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే భద్రత కల్పించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. కాగా జోగి రమేశ్ ఇంటిపై <<19023109>>దాడి ఘటనలో<<>> పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో 11 మందిని అరెస్టు చేశారు.


