News November 13, 2025
భద్రాద్రి జిల్లాలో 83,850 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే ఆయిల్‌పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్లో జరిగిన అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సమగ్ర కార్యచరణ అవసరమన్నారు. 23 మండలాల్లో 21,329 మంది రైతులు 83,850 ఎకరాల్లో సాగు చేస్తున్నారని, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 14,500 ఎకరాల లక్ష్యంలో 8,163 ఎకరాలకు చేరామన్నారు.
Similar News
News November 14, 2025
గొంతులో మటన్ ముక్క.. ఊపిరాడక వ్యక్తి మృతి

TG: నాగర్ కర్నూల్ జిల్లాలోని బొందలపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. నిన్న రాత్రి తాపీ మేస్త్రీలకు ఓ ఇంటి యజమాని దావత్ (విందు) ఏర్పాటు చేశారు. అక్కడ మటన్ తింటుండగా లక్ష్మయ్య (65) గొంతులో ముక్క ఇరుక్కుపోయింది. దీంతో ఆయన శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి.
News November 13, 2025
HYD: చిన్న గొడవకే.. కత్తులు దూసుకుంటున్నారు!

చిన్నచిన్న కారణాలకే గొడవలు కత్తుల దాడులుగా మారిపోతున్న పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇందులో ఎక్కువగా యువతే పాల్గొంటుండటం మరింత ఆందోళనకరం. 2025 అక్టోబర్ నాటికి నగరంలో దాదాపు 60 హత్యలు జరిగినట్లు తేలింది. వీధి గొడవలు, గ్యాంగ్ సంస్కృతి, సోషల్ మీడియా ప్రేరేపణలు, సులభంగా ఆయుధాలు అందుబాటులోకి రావడం ఈ హింసకు కారణాలుగా తెలుస్తోంది.
News November 13, 2025
నెల్లూరు జిల్లా వాసికి కీలక పదవి

నెల్లూరు(D) విడవలూరుకు చెందిన సుమంత్ రెడ్డిని TTD ఢిల్లీ దేవాలయ స్థానిక సలహా కమిటీ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. దేశ రాజధానిలోని ఈ ప్రసిద్ధ ఆలయాన్ని ప్రతి వారం వేలాది మంది భక్తులను దర్శించుకుంటారు. ఇటీవలే సుమంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. బుధవారం సుమంత్ మంత్రి లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈయన నెల్లూరు DCMS ఛైర్మన్ గానూ పని చేశారు.


