News February 2, 2026
భద్రాద్రి జిల్లాలో 9 నామినేషన్ల ఉపసంహరణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఆదివారం మూడు మున్సిపాలిటీల్లో మొత్తం 9 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. అశ్వారావుపేటలో ఆరుగురు కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోగా.. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. ఇల్లందులో మాత్రం ఎలాంటి ఉపసంహరణలు జరగలేదని అధికారులు వెల్లడించారు.
Similar News
News February 2, 2026
జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలి: హైకోర్టు

AP: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటి వద్ద భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. జోగి రోహిత్ వేసిన పిటిషన్‌పై కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. రమేశ్‌పై ఎలాంటి దాడులు జరిగినా పోలీసులదే బాధ్యత అని స్పష్టం చేసింది. కాగా ఇప్పటికే భద్రత కల్పించారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. కాగా జోగి రమేశ్ ఇంటిపై <<19023109>>దాడి ఘటనలో<<>> పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేశారు. నిందితుల్లో 11 మందిని అరెస్టు చేశారు.
News February 2, 2026
జనగాం: సజావుగా ప్రయోగ పరీక్షలు

జనగాం ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో ప్రయోగ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కే.జితేందర్ రెడ్డి తెలిపారు. 530 జనరల్ విద్యార్థుల్లో 523, 739 ఒకేషనల్ విద్యార్థుల్లో 661 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 450 జనరల్ విద్యార్థుల్లో 437, 611 ఒకేషనల్ విద్యార్థుల్లో 587 మంది హాజరయ్యారు.
News February 2, 2026
భీమవరం: కాలువలోకి దూసుకెళ్లిన కారు.. వ్యక్తి మృతి

భీమవరం రూరల్ మండలం రాయలం గ్రామ శివారులో ఆదివారం ఓ కారు రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.


