News December 12, 2025

భద్రాద్రి జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 159 పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 71.79 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.

Similar News

News December 14, 2025

భువనగిరి: 11 గంటలవరకు 56% మాత్రమే పోలింగ్

image

యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండో విడత సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భువనగిరి, బి.పోచంపల్లి, బీబీనగర్, రామన్నపేట, వలిగొండ మండలాల్లో ఉదయం 11 గంటలవరకు 56.51 % పోలింగ్ నమోదైంది. జిల్లాలో ఐదు మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది. జిల్లా కలెక్టర్ హనుమంతరావు దగ్గరుండి పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.

News December 14, 2025

కర్నూలు క్రీడాకారులను ఢిల్లీలో అభినందించిన ఎంపీ

image

న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 69వ నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పాల్గొంటున్న కర్నూలు ఈత క్రీడాకారులను ఎంపీ నాగరాజు ఆదివారం అభినందించారు. అండర్-19 విభాగంలో పాల్గొంటున్న హేమలత, అండర్-17 విభాగంలో పాల్గొంటున్న శృతి, సిరి చేతన రాజ్, లహరి ఢిల్లీలో ఎంపీని కలిశారు. వారు పాల్గొంటున్న ఈవెంట్ల గురించి ఎంపీ అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.

News December 14, 2025

KMR: ముగిసిన పోలింగ్ సమయం.. కౌంట్ డౌన్ స్టార్ట్

image

కామారెడ్డి జిల్లాలో రెండవ విడత పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఎల్లారెడ్డి డివిజన్‌లోని 4 మండలాల్లో బాన్సువాడ డివిజన్‌లోని 3 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో గేటు లోపల ఉన్న ఓటర్లకు అనుమతించి పోలింగ్ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం 2 గం.ల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ మొదలుకానుంది. బరిలో నిలిచిన అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.