News February 12, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739289820062_19535177-normal-WIFI.webp)
✓ పురుగుమందు తాగి యువకుడి సూసైడ్ ✓ చిలకలగట్టు జాతరకు సర్వం సిద్ధం ✓ అర్చకుడిపై దాడిని ఖండించిన VHP ✓ హామీల అమలుకు ఈనెల 20న చలో హైదరాబాద్ లిస్టు ✓ మణుగూరు అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలి ✓ పోలింగ్ విధుల్లో నిబంధనలు పాటించాలి: అదనపు కలెక్టర్ ✓ చిరుమళ్ల జాతర ఏర్పాట్లు పర్యవేక్షించిన డీఎస్పీ ✓ ఏజెన్సీ చట్టాల జోలికి వస్తే సహించేది లేదు: ఆదివాసీ నాయకులు.
Similar News
News February 12, 2025
కొనరావుపేట్: ఖాళీ సిలిండర్ల దొంగ అరెస్ట్..
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739289681557_52088599-normal-WIFI.webp)
దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు కోనరావుపేట ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మండలంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. కొనరావుపేటకు చెందిన ముడారి పోశెట్టి ట్రాలీ ఆటోలో నుంచి నిమ్మపల్లి గ్రామానికి చెందిన మోహన్ నాయక్ (38) 2 ఖాళీ సిలిండర్లను ఎత్తుకొని పారిపోయాడని తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
News February 12, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739295004644_893-normal-WIFI.webp)
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 12, 2025
HYD: 9000113667 ఈ నంబర్‌కు కాల్ చేయండి..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739291367747_52296546-normal-WIFI.webp)
చెరువుల్లో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోను నంబర్‌ను 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని కోరింది. ఇప్పటి వరకు 48 కేసులు కాగా రాత్రీపగలు నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకున్నామని తెలిపింది.