News February 14, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ భద్రాద్రి: 19 మంది మావోయిస్టుల లొంగుబాటు  ✓ యథేచ్చగా పంచాయతీ ఎన్నికలు జరపాలి:  కలెక్టర్ ✓ భద్రాద్రిలో విషాదం.. ఇద్దరి దుర్మరణం ✓ అశ్వారావుపేటలో విద్యార్థులతో వెట్టిచాకిరి ✓ చిరుమళ్ల వనదేవతలను దర్శించుకున్న మంత్రి సీతక్క, ఎమ్మెల్యే పాయం ✓ ఇల్లందు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ✓ కొత్తగూడెంలో యథేచ్చగా ప్రభుత్వ భూముల కబ్జా ✓ బూర్గంపాడు: కారు, బైక్ ఢీ.. ✓ పర్ణశాలలో ఔషధ మోక్కలు నాటాలి: కలెక్టర్.

Similar News

News September 18, 2025

HYD: దుర్గామాత మండపాలకు అనుమతి తప్పనిసరి

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. నిర్వాహకులు మండపాల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. వెబ్‌సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో నమోదు చేయాలన్నారు.

News September 18, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బిల్లులు..!

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు డబుల్ బిల్లులు మంజూరయ్యాయి. లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున వారి ఖాతాల్లో జమ అయిన నాలుగు రోజుల తర్వాత తిరిగి అదే మొత్తాన్ని మరోసారి జమ చేశారు. ఈ విషయం గమనించిన గృహనిర్మాణ శాఖ అధికారులు డబుల్ బిల్లులు పొందిన లబ్ధిదారుల నుంచి డబ్బును రికవరీ చేసి, ప్రభుత్వ ఖాతాల్లో జమ చేయాలని స్థానిక ఏఈ, ఎంపీడీవోలను ఆదేశించారు.

News September 18, 2025

ADB: చుక్క నీటి కోసమే చుట్టూ పోరాటం!

image

ధనరాశులు ఎంతైనా పోగుచేయగలం కానీ, జలరాశులను సృష్టించలేం. నీటిని వృథా చేస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనడానికి ఉమ్మడి ADBలో ఏర్పడిన ఘటనలే నిదర్శనం. 5నదులు, 14 వాగులు, 3500+ చిన్న నీటి వనరులున్న జిల్లాలో వానాకాలంలో తాగునీటి కష్టాలు చూస్తున్నాం. పట్టణాల్లో చెరువులు, వాగులను ఆక్రమించడంతో వానలకు వరదలు రాగా.. ఎండాకాలంలో ట్యాంకర్లతో నీరు తెప్పించుకునే పరిస్థితి.
#నేడు నీటి పర్యవేక్షణ దినోత్సవం.