News July 5, 2025
భద్రాద్రి: జులైలో అధిక వర్షాపాతం నమోదయ్యే ఛాన్స్.!

రానున్న ఐదు రోజులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. జిల్లాలో అక్కడక్కడా ఈదురుగాలులతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. జులై నెలలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు గమనించాలని సూచించారు.
Similar News
News July 5, 2025
ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు

ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
News July 5, 2025
కామారెడ్డి జిల్లాలో నాట్లు షురూ.. లక్ష్యం ఎంతంటే?

కామారెడ్డి జిల్లాలో ఖరీఫ్ సీజన్ వరి నాట్లు మొదలయ్యాయి. ఈఏడాది 3.18 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అధికారులు అంచనా వేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి వరి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి విత్తనాలు, ఎరువుల లభ్యతపై అధికారులు దృష్టి సారించారు. రైతులకు సకాలంలో అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని DAO తిరుమల ప్రసాద్ తెలిపారు.
News July 5, 2025
NLG: 8 నుంచి పోస్టల్‌లో కొత్త సాఫ్ట్వేర్

పోస్టల్ డివిజన్లోని NLG, యదాద్రి BNG జిల్లాల్లో జూలై 8 నుంచి కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానున్నట్లు సూపరింటెండెంట్ కె.రఘునాథస్వామి తెలిపారు. రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద NLG డివిజన్లోని 2 హెడ్ ఆఫీసులు, 37 సబ్ పోస్టాఫీస్‌లు, 392 పోస్టాఫీస్‌లు, 353 బ్రాంచ్ ఆఫీసుల్లో నూతనంగా ఐటీ 2.0 అప్లికేషన్ ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.