News September 9, 2025
భద్రాద్రి డీఈవోగా విద్యా చందన

భద్రాద్రి జిల్లా విద్యాధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందనకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె జిల్లా విద్యా విభాగానికి సంబంధించిన పరిపాలనా, పర్యవేక్షణా కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. అలాగే పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల, ఉపాధ్యాయుల పర్యవేక్షణ వంటి కీలక అంశాలపై ఆమె పర్యవేక్షణ చేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Similar News
News September 10, 2025
సెప్టెంబర్ 10: చరిత్రలో ఈ రోజు

1895: కవి విశ్వనాథ సత్యనారాయణ జననం
1905: సంగీత దర్శకుడు ఓగిరాల రామచంద్రరావు జననం
1912: భారత మాజీ ఉప రాష్ట్రపతి బి.డి.జెట్టి జననం
1921: చిత్రకారుడు వడ్డాది పాపయ్య జననం
1922: శాస్త్రవేత్త యలవర్తి నాయుడమ్మ జననం
1935: నటుడు పీఎల్ నారాయణ జననం
1944: ఫ్రీడమ్ ఫైటర్ సర్దార్ దండు నారాయణ రాజు మరణం
1985: తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ మరణం (ఫొటోలో)
☛ ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
News September 10, 2025
తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు అందుకే రావట్లేదు: శివకార్తికేయన్

రాబోయే రోజుల్లో తమిళ సినిమాలు ₹1000 కోట్ల కలెక్షన్ మార్కును చేరుకుంటాయని శివకార్తికేయన్ ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ ధరలు పెంచకపోవడం, 4 వారాలకే సినిమాలు OTTలోకి వస్తుండటం వల్ల ₹1000Cr కలెక్షన్స్ రాబట్టలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులకు కంటెంట్‌తో మెప్పించిన మూవీలే పాన్ ఇండియా సినిమాలు అవుతాయన్నారు. 4 వారాలకే OTTలోకి రావడంతో థియేటర్లలో లాంగ్ రన్ ఉండట్లేదని పేర్కొన్నారు.
News September 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 10, బుధవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
✒ ఇష: రాత్రి 7.35 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.