News November 13, 2025

భద్రాద్రి: డోలీలోనే ప్రసవం.. రోడ్డు లేక గిరిజనుల కష్టం

image

గ్రామాలు పట్టణాలుగా మారుతున్నా జిల్లాలో పరిస్థితి ఏ మాత్రం మారడం లేదు. బూర్గంపాడు(M) మోత పట్టి నగర్‌లోని చింతకుంట గిరిజన గ్రామానికి నేటికీ రోడ్డు సౌకర్యం దక్కలేదు. బుధవారం పురిటి నొప్పులు రావడంతో ఓ గర్భిణి గ్రామస్థులు కిలోమీటరు డోలీలో మోసుకురావాల్సి వచ్చింది. సకాలంలో 108 వచ్చినా, రోడ్డు అధ్వానంగా ఉండటంతో, ఆమె దారి మధ్యలోనే అంబులెన్స్‌లో ప్రసవించింది. రోడ్డు సదుపాయం కల్పించాలని గ్రామస్థులు కోరారు.

Similar News

News November 13, 2025

ఉసిరిలో కాయకుళ్లు, నల్లమచ్చ తెగుళ్ల నివారణ

image

కాయకుళ్లు తెగులు సోకిన ఉసిరి కాయలపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడి వాటి నుంచి చెడువాసన వస్తుంటుంది. దీని నివారణకు కాయలను నిల్వ ఉంచే ముందు 2 శాతం ఉప్పు ద్రావణంలో కానీ లేదా 1% బోరాక్స్ మిశ్రమంలో కానీ ముంచి తీయాలి. ఉసిరిలో నల్లమచ్చ తెగులు వల్ల కాయలపై నల్ల మచ్చలు చిన్నవిగా ఏర్పడి క్రమంగా పెద్దవి అవుతాయి. తెగులు కట్టడికి లీటరు నీటికి 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్‌ను తొలకరి చినుకులు పడిన వెంటనే పిచికారీ చేయాలి.

News November 13, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

⋆ కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ నటించబోయే సినిమా నుంచి అనివార్య కారణాలతో తప్పుకుంటున్నట్లు ప్రకటించిన డైరెక్టర్ సి.సుందర్
⋆ అట్లీ-అల్లు అర్జున్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. మే నాటికి బన్నీ షూటింగ్ పూర్తవుతుంది: సినీ వర్గాలు
⋆ దుల్కర్ సల్మాన్, రానా, భాగ్యశ్రీ, సముద్రఖని నటించిన ‘కాంత’ సినిమాకు U/A సర్టిఫికెట్.. సినిమా నిడివి 2.40hrs.. రేపే థియేటర్లలో విడుదల

News November 13, 2025

‘బాల్య వివాహాల రహితంగా సిరిసిల్ల జిల్లాను మార్చాలి’

image

బాల్య వివాహాల రహిత జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ఎం.చందన పేర్కొన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, అమలవుతున్న పథకాలు, బాల్య వివాహాలు తదితర అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు, ఇన్‌ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌తో కలిసి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.