News February 12, 2025

భద్రాద్రి: నిధులు దుర్వినియోగం.. ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష

image

భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీలో రూ.23,89,750 ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై భద్రాచలం జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివనాయక్ మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో అప్పటి పంచాయతీ కార్యదర్శి బత్తిన శ్రీనివాస రావు, సర్పంచ్ ధరావత్ చందునాయక్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారని బూర్గంపాడు SI రాజేశ్ తెలిపారు.

Similar News

News February 12, 2025

సంగారెడ్డి: త్వరలో హరీశ్ రావు పాదయాత్ర

image

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోత ప్రాజెక్టులు పూర్తి చేయాలని డిమాండ్‌తో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు త్వరలో పాదయాత్ర చేపట్టనున్నట్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులు భూసేకరణ దశలో నిలిచిపోయాయని, తిరిగి పనులు ప్రారంభించాలని పాదయాత్ర చేపడతామన్నారు. ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గంలో హరీశ్ రావు పాదయాత్ర కొనసాగుతుందన్నారు.

News February 12, 2025

HYD: కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది: కునంనేని

image

కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ముగ్ధూం భవన్‌లో ఆయన మాట్లాడుతూ..‘కాంగ్రెస్ చెప్పింది చేయలేకపోయింది. ప్రజా ప్రతినిధులు ఫోన్‌లు ఎత్తడం లేదు. సిస్టం ఫాలో అవడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కలిసొస్తే పోటీ చేస్తాం. లేకపోతే బలంగా ఉన్న చోట పోటీ చేస్తాం’ అన్నారు.

News February 12, 2025

వాట్సాప్‌ ద్వారా సింహాచలం దర్శనం టికెట్స్

image

సింహాచలం సింహాద్రి అప్పన్న దర్శనం టికెట్స్, ఆర్జిత సేవ టికెట్స్ ఆన్‌లైన్ ద్వారానే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా కూడా లభ్యమవుతున్నాయని ఈవో త్రినాథ్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9552300009 నంబర్‌కు వాట్సాప్ చేసి టికెట్స్ బుకింగ్ చేసుకొనవచ్చు అన్నారు. అలా బుకింగ్ చేసుకున్న టికెట్స్ కాపీను తీసుకొని దర్శనం చేసుకోవచ్చని తెలిపారు.

error: Content is protected !!