News October 9, 2025

భద్రాద్రి: నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

image

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 11వ తేదీ వరకు రోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. 12న పరిశీలన, 13న అభ్యంతరాల స్వీకరణ, 15న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Similar News

News October 9, 2025

శ్రీశైలం అధికారులకు సీఎం ప్రశంస

image

రాష్ట్ర ప్రజలకు శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ నెల 16న PM మోదీ శ్రీశైలానికి రానుండటంతో సీఎం పేరుతో ఓ లెటర్ విడుదలైంది. శ్రీశైల దేవస్థానం ప్రతినిధులు ‘శ్రీశైల నూతన తామ్ర శాసనాలు’ అనే గ్రంధాన్ని ప్రచురించడం, ప్రధాని తిలకించేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రదర్శన పెట్టడం అభినందనీయమని సీఎం కొనియాడారు.

News October 9, 2025

రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటు: డిప్యూటీ స్పీకర్

image

పద్మవిభూషణ్ రతన్ టాటా మరణం దేశానికి తీరని లోటని డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం రతన్ వర్ధంతి సందర్భంగా పెద అమిరంలోని ఆయన విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. పారిశ్రామిక రంగానికే కాక, ప్రపంచానికే ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు. గొప్ప మానవతావాదిగా ఆయన సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమని రఘురామ కృష్ణంరాజు కొనియాడారు.

News October 9, 2025

MBNR: అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు: ఎస్పీ

image

ఎన్నికల కోడ్‌ను జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచనలు, నిబంధనల మేరకు వ్యవహరించాలని, శాంతి భద్రతలకు ఆటంకం కలిగించవద్దని ఆమె కోరారు. అనుమానాస్పద కార్యకలాపాలపై పోలీసు నిఘా ఉంటుందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసినా, ఇతరుల మనోభావాలను కించపరిచేలా పోస్ట్‌లు పెట్టినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.