News September 10, 2025
భద్రాద్రి: నేడు, రేపు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలకు సెలవు

దమ్మపేట మండలంలోని అప్పారావుపేట, అశ్వారావుపేటలో గల రెండు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలకు వరుసగా రెండు రోజులు పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఫ్యాక్టరీ మేనేజర్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వారం రోజులు ఫ్యాక్టరీలకు ఆయిల్‌పామ్ గెలలు అధికంగా వచ్చాయని అన్నారు. ఈ కారణంగా బుధవారం, గురువారం గెలలు కొనబోమని పేర్కొన్నారు. తిరిగి శుక్రవారం నుంచి గెలలు యథావిధిగా కొంటామని, రైతులు సహకరించాలని కోరారు.
Similar News
News September 10, 2025
SKLM: 11న డయల్ యువర్ ఆర్ఎం

స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసే క్రమంలో అవగాహన కోసం డైల్ యువర్ ఆర్టీసీ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి సి.హెచ్ అప్పలనారాయణ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 11న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపు 99592 25603 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు.
News September 10, 2025
ఇంద్రవెళ్లి : రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

ఇంద్రవెళ్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని ధన్నుర బి వద్ద ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఒక బైక్‌పై గుడిహత్నూర్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు, మరో బైక్‌పై ఉట్నూర్ మండలం ఉమ్రి తాండ్రకు చెందిన ఒక కుటుంబం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 10, 2025
15 నుంచి మంచిర్యాలలో వందేభారత్ హాల్టింగ్

వందేభారత్ రైలు సికింద్రాబాద్- నాగపూర్, పెద్దపల్లి జంక్షన్ మీదుగా మంచిర్యాలలో నిలుపుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల నెల 15న మంచిర్యాల రైల్వే స్టేషన్ ఆవరణలో రైలు ఆరంభ వేడుకలు నిర్వహించేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరై జెండా ఊపి రైలును ప్రారంభించనున్నారు.