News September 10, 2025
భద్రాద్రి: పల్లె ప్రకృతి వనాలు.. పశువులకు నిలయాలు!

అళ్లపల్లి మండలం మైలారం పాఠశాల పక్కన లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గేదెల మేతకు నిలయంగా మారింది. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో భాగంగా దీనిని ఏర్పాటు చేసింది. అయితే పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతో వనంలో చెట్లు నాశనమవుతున్నాయి. అధికారులు వెంటనే దీని చుట్టూ కంచె ఏర్పాటు చేసి మొక్కలను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
Similar News
News September 10, 2025
SPMVV: నూతన డేటా సెంటర్ ప్రారంభం

SPMVVలో బుధవారం ఇండియన్ సొసైటీ ఫర్ ప్రోపబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ నూతన డేటా సెంటర్‌ను ప్రారంభించినట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. ఈ కార్యక్రమానికి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, మహిళా వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఉమ, IIT తిరుపతి డైరెక్టర్ సత్యనారాయణ, ISI కలకత్తా మాజీ డైరెక్టర్ ప్రకాశ్ రావు పాల్గొన్నారు. గణాంక శాస్త్రవేత్తలను తీర్చిదిద్దడంలో ఉపయోగపడుతుందన్నారు.
News September 10, 2025
చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్

AP: లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (A-38)కి మరోసారి నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. గతంలోనూ చెవిరెడ్డి పిటిషన్ న్యాయస్థానం కొట్టేసింది. కాగా ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు రెండు రోజుల క్రితం బెయిల్ మంజూరైంది.
News September 10, 2025
మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు: VZM SP

మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష, రూ.వెయ్యి జరిమానాను కోర్టు విధించిందని SP వకుల్ జిందాల్ తెలిపారు. 2023లో కొత్తవలసలోని కుమ్మరివీధిలో సూర్యకాంతం ఇంట్లోకి ఎల్.కోట (M) జమ్మాదేవిపేటకు చెందిన కృష్ణ చొరబడి ఆమెను గాయపరిచి బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో నిందితుడికి శిక్ష ఖరారైంది.