News October 16, 2025

భద్రాద్రి: పోరుకు పుంజులు సన్నద్ధం..!

image

అశ్వారావుపేట మండలం పండువారిగూడెంకు చెందిన ఓ రైతు సంక్రాంతి కోసం తన పొలంలో వందలాది కోడి పందెం పుంజులను పెంచుతున్నాడు. గ్రీన్ హీట్ కంచెలు, ఇనుప గంపలు, తాటి ఆకులతో ఏర్పాటు చేసిన రక్షణ గోడలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పండుగ దగ్గర పడుతుండటంతో పుంజులను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

Similar News

News October 16, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని నిలదీసిన కాంగ్రెస్ కార్యకర్త
> ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన: కడియం
> రఘునాథపల్లి: Way2News కథనానికి స్పందన
> జనగామ కలెక్టరేట్ ఎదుట సీపీఎం నేతల ధర్నా
> బచ్చన్నపేట: రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన ఎంజేపీ విద్యార్థి
> ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న నమ్మకాన్ని కాపాడాలి: కలెక్టర్
> రైతులు పత్తి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

News October 16, 2025

NRPT: ‘ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ ఫలితాలు’

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తుందని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం నారాయణపేటలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ సిబ్బంది సమావేశం ఏర్పాటు చేసి వారిని అభినందిస్తూ అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సన్మానించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజలకు గూడు కల్పించాలని ఈ పథకాన్ని ప్రారంభించిందని అన్నారు.

News October 16, 2025

జనగామ: పత్తి మద్దతు ధర పోస్టర్ ఆవిష్కరణ

image

ప్రభుత్వం సీసీఐ పత్తి కొనుగోళ్లకు సంబంధించిన మద్దతు ధర పోస్టర్‌ను జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా గురువారం సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ప్రతి రైతు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు పత్తిని విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, వ్యవసాయ శాఖ అధికారిని అంబికా సోనీ, తదితరులు పాల్గొన్నారు.