News March 30, 2025

భద్రాద్రి ప్రజలకు ఎస్పీ ఉగాది శుభాకాంక్షలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రజల జీవితాలు ఉగాది పచ్చడిలా షడ్రుచులతో నిండాలని, ప్రతి ఒక్కరూ ఈ తెలుగు నూతన సంవత్సర ఆరంభాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.

Similar News

News September 14, 2025

16న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

image

తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ శుద్ధి, కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. 15న వీఐపీ బ్రేక్ దర్శనాల సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా అష్టదళ పాదపద్మారాధన, వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

News September 14, 2025

వికసిత్ భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యం: జేపీ నడ్డా

image

వికసిత భారత్ బీజేపీ ప్రధాన లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఆదివారం విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో సారద్యమ్ సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలనలో ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్ అంధకారంలో మగ్గిందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం 15 నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమయిందని చెప్పారు. మోదీ, చంద్రబాబు అంకితభావం వల్లే ఈ మార్పు సాధ్యమైందన్నారు.

News September 14, 2025

HYD భార్య గొంతుకోసిన భర్త.. ఆస్పత్రికి తరలింపు

image

నాగోల్‌‌లో భార్య మహాలక్ష్మి గొంతును భర్త వేణుగోపాల్ కత్తితో కోశాడు. దీంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఏడాది క్రితం మహాలక్ష్మితో వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అతడు మారకపోగా.. ఈరోజు ఘాతుకానికి ఒడిగట్టాడు. కాగా, వేణుగోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.