News March 27, 2026

భద్రాద్రి బార్ కౌన్సిల్ విజేతలు వీరే..!

image

భద్రాద్రి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ ముదల్కర్, ఉపాధ్యక్షురాలిగా షాజహాన్ పర్వీన్, ఉపాధ్యక్షుడిగా కాటూరి సంజీవరావు, ప్రధాన కార్యదర్శిగా గడిపల్లి మహేశ్వర రావు, సంయుక్త కార్యదర్శిగా గడదాసు నాగరాజు, గ్రంథాలయ కార్యదర్శిగా దొడ్డ ప్రసాద్, కోశాధికారిగా సంధ్యారాణి, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శులుగా దేవదాస్, ఉమ గెలుపొందారు. 328 ఓట్లకు గాను 309 ఓట్లు పోలయ్యాయి.

Similar News

News April 5, 2026

TU: ఇంటిగ్రేటెడ్ పీజీ పరీక్షలు వాయిదా

image

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ పీజీ (అప్లైడ్ ఎకనామిక్స్, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ) 8, 10 సెమిస్టర్ల రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను పలు సాంకేతిక కారణాల రీత్యా వాయిదా వేశారు. దీంతో శనివారం నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల రీ షెడ్యూల్‌ను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు.

News April 5, 2026

టెస్టులపై BCCI ఫోకస్.. తర్వాతి తరాన్ని సిద్ధం చేసేందుకు ప్లాన్!

image

NZ, SAతో స్వదేశంలో టెస్ట్ సిరీస్‌లు ఓడటంతో BCCI రెడ్ బాల్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టింది. జూన్/జులైలో 64 మంది U25 క్రికెటర్లతో రెడ్ బాల్ ఇంట్రా టోర్నీ నిర్వహించనుంది. వారిని 4 జట్లుగా విభజించి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో మ్యాచులు ఆడించనున్నట్లు BCCI అధికారి ఒకరు తెలిపారు. ఇందులోనుంచి 25 మందిని సెలక్ట్ చేసి టెస్టుల కోసం సిద్ధం చేస్తారు. ఈ లిస్టులో వైభవ్, మాత్రే కూడా ఉంటారని సమాచారం.

News April 5, 2026

కామారెడ్డిలో జాబ్ మేళా

image

కామారెడ్డి కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఈనెల 7న ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు నిరుద్యోగ యువత కోసం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 7వ తరగతి నుంచి ITI చదివి 19-39 ఏళ్ల అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ప్రైవేటు కంపెనీలో 150 ఉద్యోగాలకు ఎంపికలు చేపట్టనున్నారు. ₹30,000 జీతం ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అభ్యర్థులు బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కాపీలతో హాజరు కావాలన్నారు.