News March 21, 2025

భద్రాద్రి: భార్య మందలించిందని.. భర్త ఆత్మహత్య

image

భార్య మందలించిందని భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలోని జగ్గుతండాలో గురువారం చోటుచేసుకుంది. ఎస్ఐ రతీష్ వివరాలిలా.. జగ్గుతండాకు చెందిన అజ్మీరా మోహన్(47) మద్యానికి బానిసై, తరచూ మద్యం తాగి ఇంటికి వస్తుండడంతో భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు తెలిపారు. కేసు నమోద చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News March 28, 2025

అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

>అల్లూరి జిల్లాలో భానుడి ప్రతాపం
>పాడేరు: సోషల్ స్టడీస్ పరీక్ష తేదీ మార్పు
>అడ్డతీగల: ప్రతీ ఏకలవ్య మోడల్ పాఠశాలలో భూసార పరీక్షా కేంద్రం
>పర్యాటకులు లేక బోసిపోయిన చాపరాయి జలపాతం 
>పాడేరు: 10 మంది మావోయిస్టులు లొంగుబాటు
>రంపచోడవరం: ఉగాదికి శ్రీవారి లడ్డూ ప్రసాదం
>డ్రోన్ ద్వారా సాగు విధానంపై అవగాహన
>అల్లూరి జిల్లాలో పది పరీక్షలకు 99 మంది దూరం

News March 28, 2025

ధోనీ క్రేజ్ వల్ల చెన్నైకి దెబ్బే: అంబటి రాయుడు

image

భారీగా పెరుగుతున్న ధోనీ మేనియా సీఎస్కేకు మంచిది కాదని అంబటి రాయుడు ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. ‘చాలా మంది అభిమానులు ధోనీ బ్యాటింగ్ చూసేందుకే స్టేడియానికి వస్తుంటారు. వారు సీఎస్కే టీమ్‌లోని మిగతా బ్యాటర్లు త్వరగా ఔటై వెళ్లిపోవాలని కోరుకుంటారు. కొత్త ఆటగాళ్లకు ఇది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. దీనివల్ల చెన్నైకి కొత్త నాయకుడు తయారు కావడం కష్టం అవుతుంది’ అని చెప్పారు.

News March 28, 2025

పల్నాడు జిల్లా టుడే టాప్ న్యూస్

image

☞ నరసరావుపేట: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు,. ☞ సత్తనపల్లి: బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక. ☞ చిలకలూరిపేట: పరీక్షా కేంద్రంలో ఉపాధ్యాయుడికి పాముకాటు. ☞ మాచర్ల: సినిమా థియేటర్లో ఆర్డీఓ తనిఖీలు. ☞ క్రోసూరు: కేజీబీవీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. ☞ దాచేపల్లి: సిమెంట్ ఫ్యాక్టరీల ప్రభావిత గ్రామాలలో అధికారుల పర్యటన. 

error: Content is protected !!