News March 26, 2025
భద్రాద్రి: మహిళా రైతు ఆలోచన అదుర్స్!

ఇప్పటి వరకు సీసీ కెమెరాను వీధులు, దుకాణాలు, ఇళ్లల్లోనే చూశాం. కానీ అశ్వాపురం మండలం మల్లెలమడుగు వ్యవసాయ పొలంలో దొంగతనాలు, ప్రమాదాలను పసిగట్టేందుకు మహిళా రైతు పడిదం వరలక్ష్మి ఈ నిఘా నేత్రాన్ని అమర్చారు. పొలంలో కూరగాయలు, విద్యుత్ మోటర్ చోరీకి గురికాకుండా సోలార్ కెమెరా ఏర్పాటు చేసినట్లు మహిళా రైతు తెలిపారు. ఈ వినూత్న ఆలోచనను చూసి పలువురు అభినందించారు.
Similar News
News November 3, 2025
నవంబర్ 3: చరిత్రలో ఈరోజు

*1874: సాహితీవేత్త, నాటకరంగ ప్రముఖుడు మారేపల్లి రామచంద్ర శాస్త్రి జననం
*1906: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ పృథ్వీరాజ్ కపూర్ జననం
*1933: నోబెల్ బహుమతి పొందిన భారత తొలి ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ జననం
*1937: ప్రముఖ సింగర్ జిక్కి జననం
*1940: విప్లవ రచయిత వరవరరావు జననం
*1998: విలక్షణ నటుడు పీఎల్ నారాయణ మరణం
*జాతీయ గృహిణుల దినోత్సవం
News November 3, 2025
దీప్తీ శర్మ రికార్డుల మోత

ఉమెన్స్ వరల్డ్ కప్: ఫైనల్లోనే కాదు.. టోర్నమెంట్ మొత్తం దీప్తీ శర్మ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచారు. WC నాకౌట్లో 58 రన్స్, 5 వికెట్లు తీసిన తొలి ప్లేయర్(మెన్స్+ఉమెన్స్)గా చరిత్ర సృష్టించారు. ఉమెన్స్ WC ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు(22) తీసిన మూడో ప్లేయర్‌గా, ఒక వరల్డ్ కప్ ఎడిషన్‌లో 200+ రన్స్, 20+ వికెట్స్ తీసిన తొలి ప్లేయర్‌గా దీప్తి చరిత్ర సృష్టించారు.
News November 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


