News December 30, 2025
భద్రాద్రి: మేడారం జాతరకు 203 ప్రత్యేక బస్సులు

మేడారం సమ్మక్క-సారక్క జాతరకు వెళ్లే భక్తుల కోసం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ.. 203 బస్సులను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో అత్యధికంగా కొత్తగూడెం డిపో నుంచి 110 బస్సులు నడపనున్నారు. అలాగే ఇల్లందు నుంచి 41, భద్రాచలం 21, మణుగూరు 16, పాల్వంచ నుంచి 15 బస్సులను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. జాతర రద్దీని బట్టి మరిన్ని సర్వీసులు పెంచే అవకాశం ఉందని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
Similar News
News December 31, 2025
ఖమ్మం జిల్లాలో కీలక మంత్రి తనయుడి ఆధిపత్యం

ఖమ్మం జిల్లాలో ఓ కీలక మంత్రి తనయుడు చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గంలో మంత్రి పర్యటనల కంటే.. తానే ఎక్కువగా పర్యటనలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. తండ్రి అధికారంతో దాన్ని ఇప్పటి నుంచే సులువు చేసుకునే పనిలో పడ్డట్లు ప్రచారం నడుస్తుంది. మరోవైపు అధికారులకు వివిధ పనుల పరిష్కారం కోసం ఆదేశాలు సైతం ఇస్తున్నట్లు సమాచారం.
News December 31, 2025
‘ధురంధర్’పై బ్యాన్.. రూ.90 కోట్లు లాస్: డిస్ట్రిబ్యూటర్

రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్‌లో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’ ఈ ఏడాదిలోనే అత్యధిక వసూళ్లు(రూ.1100+కోట్లు) రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ సినిమాకు మిడిల్ ఈస్ట్ దేశాల్లో రూ.90 కోట్లు లాస్ అయ్యామని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. సౌదీ అరేబియా, UAE, బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్ దేశాలు మూవీని బ్యాన్ చేయడమే కారణమని పేర్కొన్నారు. PAKకు వ్యతిరేకంగా ఉండటంతో ఈ సినిమాను ఆ దేశాలు నిషేధించాయి.
News December 31, 2025
నారాయణపేట అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్

నారాయణపేట జిల్లా నూతన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ఉమాశంకర్ ప్రసాద్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా తాండూరు అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయనను నారాయణపేటకు బదిలీ చేశారు. గతంలో ఇక్కడ నియమించిన నారాయణ్ అమిత్ మాలెంపాటి నియామకాన్ని రద్దు చేస్తూ, ఉమాశంకర్ ప్రసాద్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.


