News March 19, 2025
భద్రాద్రి: మైనర్‌పై అత్యాచారం..యువకుడిపై పోక్సో కేసు

భద్రాద్రి జిల్లా టేకులపల్లి మండలంలోని ఓ గ్రామంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో యువకుడి(24)పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు సోమవారం రాత్రి ఊరు చివరికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడగా, విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారి ఫిర్యాదు మేరకు, యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వివరించారు.
Similar News
News March 19, 2025
దోచిన సొత్తును శ్మశానంలో దాచేవాడు: ఖమ్మం సీపీ

చాట్రాయి(M) చిత్తాపూర్‌కు చెందిన సురేందర్ దొంగతనాలు చేయడంలో టెక్నాలజీని ఉపయోగించాడని ఖమ్మం సీపీ సునీల్ దత్ మంగళవారం తెలిపారు. Google MAP ద్వారా సురేందర్ ఇంటిని మార్క్ చేసి, కొల్లగొట్టి, దొంగలించిన సొత్తును శ్మశానంలో దాచుకున్నాడని చెప్పారు. సదరు నిందితుడి నుంచి 461.19 గ్రాముల బంగారం, 425 గ్రాముల వెండి, రూ.3.32లక్షలు సీజ్ చేశామన్నారు. గత 3 నెలల్లో ఏలూరు, ప.గో.జిల్లాల్లో 43 కేసులు నమోదు అయ్యాయన్నారు.
News March 19, 2025
ఈ ఏడాది ఆ క్రేజీ మూవీకి పార్ట్-2!

క్రేజీ దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలక అప్డేట్ ఇచ్చారు. ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి పార్ట్-2 తీయనున్నట్లు హింట్ ఇచ్చారు. ఈ మేరకు ఇన్‌స్టాలో ఈ సంవత్సరం కొన్ని బాకీలు తీర్చాలని పోస్ట్ చేశారు. దీంతో ENE2 రాబోతుందని సోషల్ మీడియాలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2018లో విడుదలైన ఈ నగరానికి ఏమైంది మూవీ యువతను విశేషంగా ఆకట్టుకుంది.
News March 19, 2025
ఈ నగరాల్లో జీవనం కాస్ట్లీ గురూ!

ఇండియాలోని బెంగళూరులో జీవించడం చాలా కాస్ట్లీ అని ఓ అధ్యయనంలో వెల్లడైంది. నగరాలు అక్కడి ఖర్చులను పోల్చుతూ నెలకు ఎంత డబ్బు అవసరం అవుతుందో తెలిపింది. బెంగళూరులో నివసించేందుకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి నెలకు ₹35,887 అవసరమని పేర్కొంది. ముంబైలో ₹33,321, ఢిల్లీలో ₹33,308, పుణేలో ₹32,306, HYDలో ₹31,253, అహ్మదాబాద్‌లో ₹31,048, చెన్నైలో ₹29,276 అవసరం. కాగా వ్యక్తుల అవసరాలను బట్టి ఇందులో మార్పులుండొచ్చు.