News March 22, 2025
భద్రాద్రి రామయ్యకు సువర్ణ తులసీ అర్చన

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాతసేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేనపూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
Similar News
News November 10, 2025
ఢిల్లీ ఘటన.. ఉమ్మడి పాలమూరులో విస్తృత తనిఖీలు

ఢిల్లీ పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా పోలీసులు అప్రమత్తమై, విస్తృత తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారులు, రాష్ట్ర సరిహద్దులైన గద్వాల జిల్లా అలంపూర్, నారాయణపేట జిల్లా కృష్ణ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. అనుమానాస్పద వస్తువులపై దృష్టి సారించి తనిఖీలు చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.
News November 10, 2025
యాదాద్రి: మధ్యాహ్న భోజనం తనిఖీ చేయనున్న అధికారులు

ఈనెల 11, 13న జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించాలని కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని ఎంపిక చేసిన అధికారులచే మధ్యాహ్న భోజనంతో పాటు పాఠశాల పరిసరాలను, మూత్రశాలలను పర్యవేక్షించాలని సూచించారు. పర్యవేక్షించిన అంశాలను చెక్ లిస్ట్ రూపంలో నమోదు చేసి జిల్లా కార్యాలయానికి పంపాలని తెలిపారు.
News November 10, 2025
శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యితో రూ. 251 కోట్ల దోపిడి: పట్టాభి

ధనదాహంతో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేస్తారా అని TDP నేత పట్టాభిరామ్ ప్రశ్నించారు. YCP హయాంలో TTD ఛైర్మన్‌లుగా పనిచేసిన జగన్ బంధువులు తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. YV సుబ్బారెడ్డి హయాంలో ‘భోలే బాబా’ కంపెనీ 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యిని సరఫరా చేసి రూ. 251 కోట్లు దోచుకుందని ఆరోపించారు. అంతేకాకుండా పామాయిల్ పేరుతో ఫేక్ బిల్లులు సృష్టించి రసాయనాలతో నెయ్యి తయారు చేశారన్నారు.


