News March 28, 2025
భద్రాద్రి రాముడికి పోచంపల్లి పట్టు వస్త్రాలు

భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పోచంపల్లి పట్టు వస్త్రాలు తయారవుతున్నాయి. ఎస్ఎస్ జయరాజ్ ఆధ్వర్యంలో మూడు రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు దోర్నాల శ్రీనాథ్, ఇంజమూరి యాదగిరి, ఆడేపు ఆంజనేయులు, కడవేరు చంద్రశేఖర్ భద్రాచలంలోని భక్త రామదాసు ధ్యాన నిలయంలో ఏర్పాటు చేసిన మగ్గాలపై పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు, పట్టు పంచలనేస్తున్నారు.
Similar News
News March 31, 2025
చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించారు. ఒకే మైదానంలో వన్డేలు, IPLలో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా స్టార్క్ రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు ఏ బౌలర్ ఈ ఫీట్ సాధించలేకపోయారు. SRHతో జరిగిన మ్యాచులో స్టార్క్ 5 వికెట్లు పడగొట్టారు. 2023లో ఇదే వేదికలో భారత్‌తో జరిగిన వన్డేలోనూ 5 వికెట్లు తీశారు. అలాగే DC తరఫున 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి విదేశీ ప్లేయర్‌గానూ ఆయన నిలిచారు.
News March 31, 2025
కురుపాంలో ఏనుగుల గుంపు సంచారం

పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ఏనుగుల గుంపు నుంచి తిప్పలు తప్పడం లేదు. పార్వతీపురం, కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో సంచరిస్తూ రైతులను, ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సోమవారం ఉదయం కూడా కురుపాం మండలం సీతంపేట, పూతిక వలస ప్రాంతాల్లోని చెరుకు, అరటి, పామాయిల్ తోటల్లో తిరుగుతున్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పొలాలకు వెళ్లే రైతులు, అటుగా ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
News March 31, 2025
నెల్లూరు: ఏప్రిల్ 2 నుంచి రిజిస్ట్రేషన్ స్లాట్ పద్ధతి ప్రారంభం

ఏప్రిల్ రెండవ తేదీ నెల్లూరు జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ పద్ధతిని ప్రారంభిస్తున్నట్లు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు తెలిపారు. ఆర్థిక లావాదేవీలు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్దేశించిన సమయానికి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ పద్ధతిని అమలు చేయనున్నట్లు తెలిపారు.