News November 17, 2025

భద్రాద్రి: రేపు పత్తి కొనుగోలు కేంద్రాలు బంద్

image

భద్రాద్రి పత్తి రైతులకు జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నరేందర్ సూచనలు చేశారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల సంఘం పిలుపు మేరకు రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిన్నింగ్ మిల్లులు బంద్‌లో పాల్గొననున్నాయి. కావున రైతులు పత్తి అమ్మడానికి సీసీఐ కేంద్రానికి వెళ్లకూడదని సూచించారు. రేపు సీసీఐ సీఎండీతో రాష్ట్ర జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య ముఖ్యమైన చర్చలు జరగనున్నాయని వెల్లడించారు.

Similar News

News November 17, 2025

కేయూ జేఏసీ నూతన కమిటీ ఎన్నిక

image

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటాలు నిర్వహించేందుకు కేయూ నూతన విద్యార్థి జేఏసీని నేతలు ప్రకటించారు. జేఏసీ ఛైర్మన్‌గా ఆరేగంటి నాగరాజ్, వైస్ ఛైర్మన్‌గా కేతపాక ప్రసాద్, కన్వీనర్‌గా కందికొండ తిరుపతి, కో-కన్వీనర్‌గా అల్లం విజయ్, ప్రధాన కార్యదర్శిగా బోస్కా నాగరాజ్, కార్యదర్శిగా జనగాం రాజారాం, కోశాధికారిగా రేగుల నరేశ్ నియమితులయ్యారు.

ప్రియ జనులారా.. ఉచితమంటే ఎగబడకండి!

image

చాలా మందికి ఉచితం అనే సరికి ఎగబడటం పరిపాటైంది. దీనిమాటున ప్రమాదం పొంచి ఉన్నా గుర్తించట్లేదు. తాజాగా <<18309732>>iBOMMA<<>> విషయంలోనూ ఇదే రుజువైంది. ఉచితంగా సినిమా చూసే క్రమంలో తమకు తెలియకుండానే సమాచారాన్ని వారికి చేరవేశారు. ఈ క్రమంలో 50లక్షల మంది డేటా వారి చేతికి చిక్కిందని పోలీసులు వెల్లడించారు. దీంతో ఫ్రీగా వస్తుందనే సరికి ఆన్‌లైన్‌లో ముందూ వెనకా చూడకుండా వ్యవహరిస్తే ప్రమాదమని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.