News March 16, 2026

భద్రాద్రి: రైల్వే లైన్‌తో పర్యాటక రంగానికి ప్రోత్సాహం

image

భద్రాద్రి అభివృద్ధికి కీలకమైన పాండురంగాపురం మల్కాన్గిరి రైల్వే లైన్‌కు అనుమతి లభించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సారపాక వరకు భూ సేకరణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్‌కు సూచించారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే దక్షణ అయోధ్యగా ఉన్న భద్రాద్రి ప్రాంతంలో సాంస్కృతిక శోభ వెల్లి విరుస్తుందని, పర్యాటక రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు.

Similar News

News April 14, 2026

GNT: నాగార్జున వర్సిటీ బీఆర్క్ ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఆర్క్ (2/5) 1,2 సెమిస్టర్ల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గతేడాది DECలో జరిగిన ఈ పరీక్షల రిజల్ట్స్‌ను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రీవాల్యుయేషన్‌ కోరుకునే వారు ఈ నెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు కాపీలను 24లోగా వర్సిటీ కార్యాలయంలో అందజేయాలి. ఒక్కో సబ్జెక్టు రీవాల్యుయేషన్‌ ఫీజు రూ. 2070, పర్సనల్ వెరిఫికేషన్‌ ఫీజు రూ. 2190గా అధికారులు నిర్ణయించారు.

News April 14, 2026

మరోసారి చర్చలకు డేట్ ఫిక్స్!

image

యుద్ధానికి ఎండ్ కార్డ్ వేసేందుకు అమెరికా-ఇరాన్ మరోసారి శాంతి చర్చలు జరపాలని భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం పీస్ టాక్స్‌కు అవకాశం ఉంది. అయితే మరోసారి ఇస్లామాబాద్‌ను వేదికగా ఎంచుకుంటారా? లేక మరో దేశంలో చర్చిస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

News April 14, 2026

నోటి పుండ్లు.. క్యాన్సర్ సంకేతం కావొచ్చన్న వైద్యులు

image

ఎండాకాలం వేడి వల్ల నోటిలో పుండ్లు వచ్చి వాటంతట అవే తగ్గుతాయని నిర్లక్ష్యం చేయొద్దని, 14 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘ముఖ్యంగా పొగాకు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు అవసరమైతే బయాప్సీ పరీక్ష ద్వారా అది సాధారణ పుండా లేదా క్యాన్సర్ సంకేతమా అని నిర్ధారిస్తారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది’ అని చెబుతున్నారు.