News January 1, 2026
భద్రాద్రి: విద్యార్థులకు అలర్ట్.. స్కాలర్‌షిప్ గడువు పెంపు.!

విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే ఉపకార వేతనాల దరఖాస్తు గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి శ్రీలత వెల్లడించారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు, రిన్యూవల్ చేసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వాడుకోవాలన్నారు. ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలన్నారు.
Similar News
News January 1, 2026
కనుబొమ్మలు ఒత్తుగా పెరగాలంటే?

కొందరిలో కనుబొమ్మలు చాలా పలుచగా ఉంటాయి. వాటిని పెంచడానికి ఈ టిప్స్..* కనుబొమ్మలపై రోజూ ఆముదం నూనెను రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * తాజా కలబంద జెల్ ను కనుబొమ్మలపై రాసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ నూనెను కలిపి కనుబొమ్మలపై మర్దనా చేస్తే ఒత్తుగా పెరుగుతాయి.
News January 1, 2026
HYDని ‘బల్దియా’ ఎందుకు అంటారో తెలుసా?

GHMCని నగరవాసులు ‘బల్దియా’గా పిలుస్తారు. ఎందుకు ఈ పదం వాడతారో చాలా మందికి తెలియదు. పూర్వం HYDను ‘అత్రాఫ్‌బల్దా’గా పిలిచేవారు. అరబ్బీలో అత్రాఫ్ అంటే ఆవరణ, బల్దా అంటే పట్టణం. అదే అర్థంతో ఉర్దూలో నగర పాలక సంస్థను ‘బల్దియా’గా పిలవడం ప్రారంభమైంది. HYD నగర నిర్మాత మహ్మద్ కులీ కుతుబ్ షా కాలం నుంచే ఈ పదం వాడుకలోకి వచ్చింది. ఆసఫ్‌జాహీల పాలనలో ఉర్దూ అధికార భాష కావడంతో ‘బల్దియా’ ప్రజల నోట నాటుకుపోయింది.
News January 1, 2026
పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధరలు

కొత్త సంవత్సరం వేళ ఆయిల్ కంపెనీలు LPG సిలిండర్ల రేట్లను పెంచేశాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.111 పెరగ్గా, డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ రేటు రూ.1,912కు చేరింది. కాగా ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు LPG ధరల్లో మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే.


