News February 8, 2025
భద్రాద్రి: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739006773644_1280-normal-WIFI.webp)
ములకలపల్లి మండలం సుబ్బనపల్లి, బండివారి గుంపులో కరెంట్ షాక్‌తో బండి వెంకటమ్మ(57) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వారి వివరాలిలా.. వెంకటమ్మ తన నివాసంలో ఉండగా, మంచం మీద కరెంట్ వైర్ పడటంతో ఈ విషాదం జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఇంటి నుంచి కాలిన వాసన రావడంతో సమీప ప్రజలు వెళ్లి చూడగా, అప్పటికే మృతి చెందారని తెలిపారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 8, 2025
కాంగ్రెస్ దీనస్థితి చూస్తే జాలి కలుగుతోంది: కిషన్ రెడ్డి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739018388563_367-normal-WIFI.webp)
అవినీతికి పాల్పడితే ఏం జరుగుతుందో ఢిల్లీ ఫలితాలే ఉదాహరణ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘అవినీతిపై పోరాటమంటూ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. చివరికి అతడే అవినీతికి చిరునామాగా మారారు. కాంగ్రెస్ దీనస్థితి చూస్తే అందరికీ జాలి కలుగుతోంది. ఢిల్లీలో వరుసగా 3 సార్లు డకౌట్ అయింది. అసలు గెలవాలనే ఆలోచన కాంగ్రెస్‌కు ఎప్పుడూ ఉండదు. మోదీని, BJPని ఓడించాలని మాత్రమే రాహుల్ ఆలోచిస్తారు’ అని విమర్శించారు.
News February 8, 2025
కూకట్‌పల్లిలో వివాహిత SUICIDE
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739009281156_51657750-normal-WIFI.webp)
ఆర్థిక ఇబ్బందులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కూకట్ పల్లి పీఎస్ పరిధిలోని సుమిత్రానగర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ దీక్షిత తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీశెట్టి కనక రత్నమ్మ (46) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి భర్త సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.
News February 8, 2025
నల్గొండ పోలీసులకు తలనొప్పిగా పిల్లి కేసు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739017574163_691-normal-WIFI.webp)
పిల్లి పెట్టిన లొల్లి NLG పోలీసులకు తలనొప్పిగా మారింది. స్థానిక రహమత్ నగర్‌కు చెందిన పుష్పలత పెంచుకుంటున్న పిల్లి ఏడాదిక్రితం తప్పిపోగా PSలో ఫిర్యాదు చేశారు. పక్కింట్లో అదే పోలికలతో ఉన్న పిల్లి కనిపించగా ఆపిల్లి తమదేనని, పక్కింటి వారు ఎత్తుకెళ్లారంటూ Jan15న 2టౌన్ PSలో పుష్పలత కేసు పెట్టింది. పోలీసులు పిల్లి వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిచారు. పిల్లి ఎవరికి చెందుతుందో తేలాల్సి ఉంది.