News February 11, 2025

భద్రాద్రి: విధుల్లోనూ విడవని తల్లి ప్రేమ

image

తల్లి ప్రేమ ముందు ఏదీ పనికి రాదని మరోసారి నిరూపితమైంది. మంగళవారం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఏఎన్ఎంల ట్రైనింగ్‌కు పలువురు హాజరయ్యారు. ఇందులో భాగంగా పినపాకకు చెందిన ఏఎన్ఎం శ్రీ రేఖ తన ఐదు నెలల కుమారుడితో హాజరైంది. బుడ్డోడిని పడుకోబెట్టేందుకు ఆమె కలెక్టరేట్ ఆవరణలో చీరతో ఉయ్యాల కట్టి పడుకోబెట్టి, విరామ సమయంలో వచ్చి లాలించారు. ఈ తల్లి ప్రేమను చూసి సహ ఉద్యోగులు అభినందిస్తున్నారు.

Similar News

News February 12, 2025

భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

image

✓ పురుగుమందు తాగి యువకుడి సూసైడ్ ✓ చిలకలగట్టు జాతరకు సర్వం సిద్ధం ✓ అర్చకుడిపై దాడిని ఖండించిన VHP ✓ హామీల అమలుకు ఈనెల 20న చలో హైదరాబాద్ లిస్టు ✓ మణుగూరు అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలి ✓ పోలింగ్ విధుల్లో నిబంధనలు పాటించాలి: అదనపు కలెక్టర్ ✓ చిరుమళ్ల జాతర ఏర్పాట్లు పర్యవేక్షించిన డీఎస్పీ ✓ ఏజెన్సీ చట్టాల జోలికి వస్తే సహించేది లేదు: ఆదివాసీ నాయకులు.

News February 12, 2025

వికారాబాద్ జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

✓ ఏసీబీ వలలో ధరూరు ఎస్సై వేణుగోపాల్ గౌడ్.✓ కోట్ పల్లి: గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి:స్పీకర్.✓ కొడంగల్: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నాయకులు.✓ కొడంగల్, యాలాల మండలాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ.✓ VKB:ఈనెల 13న లగచర్ల రైతులతో సంప్రదింపులు:కలెక్టర్.✓ VKB:ఎన్నికల్లో ROలదే కీలక బాధ్యత:కలెక్టర్.✓VKB:అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు:స్పీకర్.

News February 12, 2025

గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ శ్రవణ్ మృతి

image

ఈనెల 9న సికింద్రాబాద్​ ప్యాట్నీ సెంటర్‌‌లోని కామాక్షి సిల్క్స్​ క్లాత్​ షోరూమ్​‌లో పెట్రోల్​ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన శ్రవణ్​ కుమార్​(37) మంగళవారం తెల్లవారుజామున గాంధీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ మృతిచెందాడు. శ్రవణ్​ 98 శాతం కాలిన గాయాలతో ఆదివారం గాంధీ ఆసుపత్రిలో అడ్మిట్​ అయ్యాడని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మార్కెట్ పీఎస్​ ఇన్​స్పెక్టర్​ రాఘవేందర్​ తెలిపారు.

error: Content is protected !!