News December 20, 2025

భద్రాద్రి: వివాహేతర సంబంధం.. భర్తను చంపి నాటకం

image

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని అటవీ శాఖాధికారిని శృతిలయ.. భర్త ధరావత్ హరినాథ్(39)ను ప్రియుడితో కలిసి దారుణంగా హతమార్చింది. పాల్వంచ(M) వెంగళరావుపేటలో జరిగిన ఈ ఘటనలో, హరినాథ్‌ను గొంతు నులిమి చంపిన అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని ఫ్యాన్‌కు ఉరివేశారు. పోలీసుల విచారణలో అసలు విషయం వెలుగులోకి రావడంతో భార్య, ప్రియుడు కౌశిక్ సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 21, 2025

ఏర్పేడు: రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

image

ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతిలో రీసెర్చ్ అసోసియేట్ (RA) పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. మొత్తం 2 ఖాళీలు ఉన్నాయి. Ph.D ఇన్ కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు అన్నారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/jobs/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేది డిసెంబర్ 25.

News December 21, 2025

MHBD: వీడని ఉత్కంఠ.. సర్పంచ్ ఎవరు..?

image

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని <<18536941>>దామరవంచ గ్రామ పంచాయతీలో<<>> విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులుగా సుజాత, స్వాతి పోటీపడ్డారు. ఎన్నికల ఫలితాల్లో తొలుత స్వాతి 3 ఓట్లతో గెలుపొందినట్లు అధికారులు ధ్రువీకరణ పత్రం అందజేయగా, రీకౌంటింగ్‌లో సుజాత ఒక్క ఓటుతో గెలిచినట్లు మరో ప్రకటన చేశారు. దీంతో సర్పంచ్ నేనంటే నేనని సోమవారం ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి సోషల్ మీడియాలో ఆహ్వానం పలుకుతున్నారు.

News December 21, 2025

అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందనే భయంతో..: సీఎం

image

TG: కేసీఆర్ తన కొడుకు కోసమే బయటికి వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ చస్తే హరీశ్ రావు పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. అల్లుడి చేతుల్లోకి పార్టీ పోతుందనే భయంతోనే కేసీఆర్ బయటకు వచ్చారు. కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికపరంగా అత్యాచారం చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది. అన్ని ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రావడం లేదు’ అని చిట్‌చాట్‌లో విమర్శించారు.