News February 9, 2026

భద్రాద్రి: సాయంత్రం 5 గంటల తరువాత ష్.. గప్ చుప్

image

భద్రాద్రి జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌లో గత కొద్దిరోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. అభ్యర్థుల్లో గెలుపు గుర్రాలు ఎవరో తేల్చే సమయం ఆసన్నమవడంతో, ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆఖరి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యాయి. సాయంత్రం 5గంటలకు మైకులు మూతపడనుండటంతో, అభ్యర్థులు ‘రోడ్ షో’లు, ఇంటింటి ప్రచారాలతో మున్సిపాలిటీలను చుట్టేయనున్నారు.

Similar News

News February 17, 2026

కాంగ్రెస్ ములుగు జిల్లా మండలాల ఇన్‌ఛార్జ్‌ల నియామకం

image

ములుగు- బానోత్ రవిచందర్, కుంజా సూర్యారామ్, మారం సుమన్ రెడ్డి
వెంకటాపూర్- గొల్లపల్లి రాజేందర్ గౌడ్, కొండం రవీందర్ రెడ్డి
గోవిందరావుపేట- బైరెడ్డి భగవాన్ రెడ్డి, ఇస్సార్ ఖాన్
తాడ్వాయి- గుమ్మడి సోమయ్య, శ్రీనివాస్ రెడ్డి, తాజుద్దీన్
ఏటూరునాగారం- చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, అర్రెం లచ్చుపటేల్
కన్నాయిగూడెం- రేగ కళ్యాణి, యానయ్య
మంగపేట- రఘు, దేవేందర్, శ్రీనివాస్
మల్లంపల్లి- రవియాదవ్, జైపాల్ రెడ్డి

News February 17, 2026

26న నెల్లూరుకు జగన్..!

image

YCP అధినేత జగన్ ఈనెల 26న నెల్లూరుకు రానున్నట్లు సమాచారం. VPR కన్వెన్షన్ హాల్లో జరగనున్న వివాహానికి ఆయన హాజరుకానున్నారు. రైల్వే కోడూరుకు చెందిన వైసీపీ ముఖ్య నేత కుమారుడి వివాహంలో జగన్ పాల్గొంటారని సమాచారం.

News February 17, 2026

మొదలవని మ్యాచ్.. ఆస్ట్రేలియా పని అయిపోయినట్లేనా?

image

T20 WC2026: ఆస్ట్రేలియా జట్టు సూపర్-8 భవిష్యత్తును నిర్ణయించే మ్యాచుకు వర్షం అడ్డంకిగా మారింది. పల్లెకెలె స్టేడియంలో వర్షం పడుతుండటంతో జింబాబ్వే vs ఐర్లాండ్ మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. వర్షం తగ్గే అవకాశాలు లేవని క్రిక్‌బజ్ తెలిపింది. ఈ మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఆస్ట్రేలియా ఈ ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ మ్యాచ్ జరిగి జింబాబ్వే గెలిచినా కంగారూలు ఇంటిదారి పట్టినట్లే.