News August 18, 2025
భద్రాద్రి: సీఎం ప్రారభించునున్న ఇందిరమ్మ ఇల్లు ఇదే!

ఈనెల 21న సీఎం రేవంత్ రెడ్డి చండ్రుగొండ మండలం బెండలపాడులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న విషయాన్ని తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ఇందిరమ్మ నివాసం సిద్ధమవుతుంది. జిల్లా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే ఆదినారాయణ గత మూడు రోజులుగా పనులను పర్యవేక్షిస్తున్నారు. కాగా నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బెండాలపాడులో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Similar News
News August 20, 2025
ఎచ్చెర్ల: డిగ్రీ 2వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

డా. బీ ఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ డిగ్రీ రెండవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ మేరకు వర్శిటీ ఎగ్జామ్స్ యూజీ డీన్ డా. జి. పద్మారావు ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఏప్రిల్‌లో జరిగిన డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 5,957 మంది విద్యార్థులు హాజరు కాగా 37.58 శాతం మంది ఉత్తీర్ణత చెందారన్నారు. రిజల్ట్స్‌ను జ్ఞానభూమి పోర్టల్‌లో చూడాలన్నారు.
News August 20, 2025
విశాఖలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం

మంగళగిరి మయూరి టెక్ పార్కు నుంచి వర్చువల్‌గా విశాఖలోని డెక్ భవనంలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను సీఎం నారా చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
News August 20, 2025
బాచుపల్లి: పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్యాయత్నం

బాచుపల్లి PS పరిధిలో దారుణ ఘటన జరిగింది. పోలీసుల వివరాలిలా.. PS సమీపంలోని హనుమాన్ ఆలయం దగ్గరలోని ఓఇంట్లో 8 (M), 3 ఏళ్ల చిన్నారులను తల్లి లక్ష్మీ సంపులో పడవేసి, తానూ ఆత్మహత్యాయత్నం చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు పిల్లలు మృతి చెందినట్లు గుర్తించి, లక్ష్మీని గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఈ దారుణానికిగల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.