News January 25, 2025

భద్రాద్రి: స్మగ్లర్లు, వేటగాళ్లపై కఠిన చర్యలు: DFO కృష్ణగౌడ్

image

అడవుల్లో వన్యప్రాణులకు ఉచ్చులు ఏర్పాటు చేసి జంతువులను చంపుతున్న వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ సూచించారు. శుక్రవారం ఆయన రేగళ్ల, ఆళ్లపల్లి, చాతకొండ పలు రేంజిలను సందర్శించారు. అడవిని కొల్లగొడుతున్న స్మగ్లర్లు, వేటగాళ్లపై నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో రేంజర్లు జశ్వంత్, కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News September 15, 2025

పులిపిర్లకు ఇలా చెక్ పెట్టేద్దాం

image

వివిధ ఆరోగ్య సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల చాలామందిలో పులిపిర్లు వస్తుంటాయి. వీటిని వదిలించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి. • దూదిని యాపిల్‌సైడర్ వెనిగర్‌లో ముంచి పులిపిర్లపై అద్దుతూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. • కలబందను పులిపిర్లపై రాస్తే కొద్దిరోజుల్లోనే రాలిపోతాయి. • ఆముదంలో బేకింగ్ పౌడర్ కలిపి, దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయాలి. ఇలా మూడు రోజులు చేస్తే పులిపిర్లు పూర్తిగా పోతాయి.

News September 15, 2025

చీనీ, నిమ్మలో తెగుళ్లు.. నివారణ

image

చీనీ, నిమ్మ తోటల్లో ఆకు, కాయ మచ్చ తెగులు(ఆల్టర్నేరియా) కనపడుతోంది. ఇది సోకితే ఆకులపై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం, కాయలపై ముదురు గోధుమ, నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు 2 గ్రా. క్లోరోథలోనిల్, 1ML అజాక్సీస్ట్రోబిన్, 1ML ప్రొపికొనజోల్ మందులను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండిన కొమ్మలు, తెగులు సోకిన ఆకులు, కాయలను ఏరివేసి నాశనం చేయాలి.

News September 15, 2025

నవంబర్‌లో టెట్: కోన శశిధర్

image

AP: మెగా DSCలో ఎంపికైన వారికి ఈ నెల 22 నుంచి 29 వరకు కేటాయించిన జిల్లాలో ట్రైనింగ్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఆ తేదీల్లోనే కౌన్సెలింగ్ కూడా పూర్తి చేసి పోస్టింగులు ఇస్తామన్నారు. ఈ నోటిఫికేషన్‌లో భర్తీ కాని 406 పోస్టులను వచ్చే డీఎస్సీలో కలుపుతామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది DSC నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నవంబర్‌లో టెట్ ఉంటుందని, ప్రిపేర్ కావాలని సూచించారు.