News December 14, 2025

భద్రాద్రి: 16 ఏకగ్రీవం.. 138 పంచాయతీలకు ఎన్నికలు

image

భద్రాద్రి జిల్లాలోని 7 మండలాల్లోని జీపీలకు నేడు రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తుగానే 16 గ్రామాల్లో సర్పంచ్‌లు, 386 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 138 గ్రామపంచాయతీల్లో సర్పంచ్ పదవులకు, 1,006 వార్డులకు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. అనంతరం ఓట్ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.

Similar News

News December 16, 2025

మెస్సీ టూర్‌లో ‘బెస్ట్ సెల్ఫీ’.. నెట్టింట ప్రశంసలు!

image

GOAT టూర్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో ఫొటో దిగేందుకు సెలబ్రిటీలు పోటీ పడగా ఓ స్పెషల్ సెల్ఫీ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. పర్యటనలో తమకు రక్షణగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్‌కు మెస్సీతో పాటు రోడ్రిగో డిపాల్, సువారెజ్ స్వయంగా కారులో సెల్ఫీ ఇచ్చారు. స్టార్ ప్లేయర్స్ అందరూ నవ్వుతూ ఇచ్చిన ఈ ఫోటోను ‘బెస్ట్ సెల్ఫీ’ అని నెటిజన్లు కొనియాడుతున్నారు. వారి నిరాడంబరతను ప్రశంసిస్తున్నారు.

News December 16, 2025

MBNR: సౌత్ జోన్.. ఈనెల 19న టేబుల్ టెన్నిస్ ఎంపికలు

image

మహబూబ్‌నగర్ జిల్లాలోని పాలమూరు వర్సిటీ నుంచి సౌత్ జోన్ ఆలిండియా టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికలను ఈ నెల 19న నిర్వహించనున్నట్లు వర్సిటీ పీడీ డా. వై.శ్రీనివాసులు ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. వయస్సు 17-25 ఏళ్లలోపు ఉండాలని, క్రీడాకారులు బోనఫైడ్, టెన్త్ మెమో, ప్రిన్సిపల్ సంతకంతో కూడిన ఎలిజిబిలిటీ ఫామ్ తీసుకురావాలన్నారు. ఎంపికలు యూనివర్సిటీ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఉంటాయన్నారు.

News December 16, 2025

పెద్దపల్లి: ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పంచాయితీ ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడో విడత పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 17న జరుగుతాయని తెలిపారు. ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమాల్లో చెప్పిన నిబంధనలు పాటిస్తూ తమ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.