News April 10, 2025

భద్రాద్రి: 2నాటు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం

image

భద్రాద్రి(D) అశ్వారావుపేట(M) కంట్లం ఎఫ్‌బీఓలు గుబ్బల మంగమ్మ తల్లి గుడి సమీప అటవీ ప్రాంతంలో 2 నాటు తుపాకులు, పేలుడు పదార్థాలతో సంచరిస్తున్న ముగ్గురు వేటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఆర్ఓ మురళి వివరాలు.. పోలీసులు గస్తీ నిర్వహించగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏపీ(S) ఏలూరు(D) బుట్టాయగూడెంకు చెందిన కారం రవి, కామ మంగబాబు, వంజం నవీన్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని వివరించారు.

Similar News

News February 25, 2026

ఖమ్మంలో ఇంటర్ తొలి రోజు పరీక్ష ప్రశాంతం

image

ఖమ్మం జిల్లాలో ఇంటర్ తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. మొదటి సంవత్సరం ద్వితీయ భాష పేపర్-1కు 18,258 మందిలో 17,667 మంది హాజరయ్యారు. గాంధీచౌక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాన్ని తనిఖీ చేసి ఏర్పాట్లు పరిశీలించారు. సీసీ కెమెరాల నిఘా, ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగాయని, ఎలాంటి అక్రమాలు నమోదు కాలేదని పేర్కొన్నారు.

News February 25, 2026

ఖమ్మంలో డిఫాల్ట్ రైస్ మిల్లులపై కేసులు నమోదు

image

ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ బకాయిలు చెల్లించని 2 రైస్ మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి బుధవారం తెలిపారు. మంగలగూడెంలోని శ్రీ సత్యనారాయణ రైస్ మిల్ రూ.13.84 కోట్లు, రాయిగూడెంలోని వెంకటేశ్వర రైస్ మిల్ రూ.10.88 కోట్లు డిఫాల్ట్ చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత యాజమాన్యాలపై పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News February 25, 2026

ఖమ్మంలో శుక్రవారం దిశ సమావేశం: కలెక్టర్

image

ఖమ్మంలో ఫిబ్రవరి 27న మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష జరగనుండగా, సభ్యులు, ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో తప్పని సరి హాజరుకావాలని సూచించారు.