News October 3, 2025

భయభ్రాంతులకు గురికావద్దు: తిరుపతి SP

image

అపోహలు, ఊహాగానాలను నమ్మవద్దని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు శుక్రవారం తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో బాంబులు పెట్టినట్లు కొన్ని ఈ-మెయిల్స్ ద్వారా బెదిరింపులు అందుతున్నాయని అన్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ మెయిల్స్ సమాచారంపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి భయభ్రాంతులకు గురికావద్దన్నారు.

Similar News

News October 3, 2025

కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీ 2028లోగా పూర్తి: CM చంద్రబాబు

image

AP: ఈ నెల 16న PM మోదీ కర్నూలులో పర్యటించనున్నారని, ఈ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రులకు CM చంద్రబాబు సూచించారు. కడపలో జిందాల్ ఉక్కు ఫ్యాక్టరీని 2028లోగా పూర్తి చేస్తామన్నారు. స్థానిక పండుగలను ప్రోత్సహించేలా విజయవాడ ఉత్సవ్ తరహా ఈవెంట్లను అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో కొందరు MLAలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని, వారిని నియంత్రించే బాధ్యత ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని స్పష్టం చేశారు.

News October 3, 2025

జిల్లా అభివృద్ధికి నిధులు విడుదల: కలెక్టర్

image

జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ ద్వారా నిధులు విడుదలైనట్లు కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. చిప్పగిరి ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో అంగన్వాడీల అభివృద్ధికి రూ.35 లక్షలు, గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.95 లక్షలు, పాఠశాలల అభివృద్ధికి రూ.20 లక్షలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. నిర్దేశించిన కాల వ్యవధిలో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

News October 3, 2025

VKBజిల్లాలో వైన్ షాప్‌ల టెండర్లకు ఒకే దరఖాస్తు.!

image

VKB జిల్లాలో 59 వైన్ షాపుల టెండర్లకు ఇప్పటి వరకు ఒకే దరఖాస్తు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 59 వైన్ షాపులకుగాను గత నెల 26 నుంచి 18 వరకు టెండర్లలో పాల్గొనేందుకు దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించారు. గత నెల 25న కేవలం ఒక దరఖాస్తు వచ్చినట్లు తెలిపారు. తాండూర్ 18, వికారాబాద్ 12, పరిగి 15, కొడంగల్ 8, మోమిన్‌పేటలో 6 షాప్‌లు ఉన్నాయన్నారు.