News March 24, 2024

భర్తను హత్యచేయించిన భార్య

image

తిప్పర్తి మండలంలోని అనిశెట్టి దుప్పలపల్లిలో ఈ నెల 17న జరిగిన వ్యక్తి హత్య కేసును పోలీసులు చేధించారు. పోలీసుల వివరాల ప్రకారం.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడు కిరాయి వ్యక్తులతో భార్య ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. భార్య, ఐదుగురు నిందితులను ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 2బైకులు, కారు, పుస్తెలతాడు,5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News February 19, 2026

NLG: బాధితుడికి అండగా నిలిచిన కలెక్టర్

image

నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ తన ఉదారతను చాటుకున్నారు. కొండమల్లేపల్లి పర్యటన నుంచి తిరిగి వస్తుండగా ధర్వేశిపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించిన ఆయన, వెంటనే తన వాహనాన్ని ఆపి క్షతగాత్రుడైన పరశురామ్‌ను పరామర్శించారు. స్వయంగా అంబులెన్స్‌కు సమాచారం అందించి, బాధితుడిని ఆసుపత్రికి పంపే వరకు అక్కడే ఉండి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కలెక్టర్ సమయస్ఫూర్తిని స్థానికులు కొనియాడుతున్నారు.

News February 19, 2026

NLG: నిరుద్యోగులకు ‘న్యాక్’ (NAC) ఉచిత శిక్షణ, ఉపాధి

image

నల్గొండ జిల్లా నిరుద్యోగ యువతకు జాతీయ నిర్మాణ అకాడమీ (NAC) ఉచిత శిక్షణతో పాటు 100% ఉపాధి కల్పించనుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎలక్ట్రీషియన్, సూర్యమిత్ర సోలార్ పీవీ ఇన్‌స్టాలర్ కోర్సులకు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలి. 90 రోజుల శిక్షణలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తారు. ఆసక్తి గల వారు నల్గొండ ఐటీఐలోని NAC కార్యాలయంలో లేదా 7893332674, 8297431655 నంబర్లలో సంప్రదించవచ్చు.

News February 19, 2026

నల్గొండ: పంట సర్వేకు వాలంటీర్ల నియామకం

image

నల్గొండ జిల్లాలో యాసంగి పంటల నమోదుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ డిజిటల్ సర్వే కోసం గ్రామానికి ఒక వాలంటీర్‌ను నియమించనున్నారు. అగ్రికల్చర్ డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి సర్వే నమోదుకు రూ.7 చొప్పున చెల్లిస్తారు. 2 రోజుల్లో లోపు నియామకాలు పూర్తి చేసి, నెల చివరిలోగా సర్వే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. జిల్లాలో 5.66 లక్షల ఎకరాల పంట వివరాలు సేకరించనున్నారు.