News April 11, 2024

భర్త ఆత్మహత్య మనోవేదనతో కుమారుడితో కలిసి భార్య బలవన్మరణం

image

కామేపల్లి మండలం గోవిందరాల గ్రామంలో ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. వ్యవసాయం చేస్తే లాభాలొస్తాయని అప్పులు తెచ్చిమరి సాగు చేస్తే చివరకు అప్పులే మిగిలాయి. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక 2నెలల క్రితం ఇంటి యజమాని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాళికట్టి అండగా నిలిచిన భర్త దూరం కావడంతో మనోవేదనకు గురైన అతడి భార్య తన కుమారుడితో కలిసి ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

Similar News

News December 25, 2025

అంబేడ్కర్‌ వర్సిటీ పరీక్ష ఫీజు గడువు 27 వరకు

image

ఖమ్మం ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ కళాశాల అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ నెల 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మహమ్మద్‌ జాకీరుల్లా తెలిపారు. డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్‌ విద్యార్థులకు ఈ గడువు వర్తిస్తుందన్నారు. రూ.1000 అపరాధ రుసుముతో జనవరి 7 వరకు అవకాశం ఉందని పేర్కొన్నారు. పీజీ సప్లిమెంటరీ విద్యార్థులు కూడా ఫీజు చెల్లించవచ్చన్నారు.

News December 24, 2025

సాగర్ కాలువలో విషాదం.. ఒక విద్యార్థి మృతదేహం లభ్యం

image

ఖమ్మం: సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ కొట్టుకుపోయిన ఇద్దరు విద్యార్థులలో ఒకరి ఆచూకీ దొరికింది. కొద్దిసేపటి క్రితం గాలింపు చర్యల్లో భాగంగా అబ్దుల్ సుహాన్ మృతదేహం లభ్యమైంది. మరో విద్యార్థి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 24, 2025

అధికారుల నిర్లక్ష్యం సహించం.. ప్రజా సంక్షేమమే లక్ష్యం: Dy.CM

image

అధికారుల నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజా ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి సంక్షేమ, అభివృద్ధి పథకం అనుకున్న లబ్ధిదారుడికి చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నామని పేర్కొన్నారు.