News March 29, 2025

భర్త చేతిలో భార్య దారుణ హత్య

image

వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామం మజార తిమ్మనీపల్లిలో భార్యను భర్త హత్య చేశాడు. పశువుల లక్ష్మీదేవి(35)ని భర్త చిన్న మధుకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం గొడ్డలితో తలపై కొట్టగా బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Similar News

News January 9, 2026

బాల్యం ‘బట్టీ’ పాలు కావొద్దు: నల్గొండ ASP

image

నల్గొండ జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు అధికారులు నడుం బిగించారు. ఇటుక బట్టీల్లో చిన్న పిల్లలతో పని చేయిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బట్టీల యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్ల లోపు పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు.

News January 9, 2026

హైదరాబాద్‌ కోసం ‘గోదావరి’ రెడీ

image

నగరవాసులకు నీళ్ల కష్టాలు తీరబోతున్నాయి. హైదరాబాదీల దాహం తీర్చడంతో పాటు మూసీకి పూర్వవైభవం తెచ్చేందుకు జలమండలి రూ. 7,360 కోట్లతో చేపట్టిన గోదావరి ఫేజ్-2, 3 పనులపై ఎండీ అశోక్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మల్లన్నసాగర్ నుంచి వచ్చే 20 టీఎంసీల నీటితో నగరం కళకళలాడనుంది. 2027 డిసెంబర్ కల్లా ప్రాజెక్టు పూర్తి చేసి, 300 ఎంజీడీల నీటిని సరఫరా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
SHARE IT

News January 9, 2026

ఖమ్మం: యాసంగి సాగుకు నీటి విడుదల షెడ్యూల్ ఖరారు

image

ఖమ్మం జిల్లాలో యాసంగి పంటల కోసం సాగర్ జలాల విడుదల షెడ్యూల్‌ను ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. మొత్తం 7 తడుల ద్వారా ఏప్రిల్ 7 వరకు నీటిని అందించనున్నారు. ఇందుకోసం మొత్తం 26.41 టీఎంసీల నీటిని వినియోగించనున్నారు. రెండో తడి కింద జనవరి 8 నుంచి 22 వరకు, మూడో తడి జనవరి 23 నుంచి ఫిబ్రవరి 6 వరకు నీరు విడుదల కానుంది. రైతులు ఈ షెడ్యూల్‌ను గమనించి నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.