News January 7, 2026

భర్త ప్రొడక్షన్‌లో సమంత సినిమా.. లుక్ రిలీజ్

image

రెండో పెళ్లి తర్వాత సమంత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. భర్త రాజ్ నిడిమోరు నిర్మాతగా, నందినీ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ ఖరారు చేశారు. సామ్ లుక్ పోస్టర్‌ను ఇవాళ విడుదల చేశారు. సంక్రాంతి కానుకగా JAN 9న టీజర్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ మూవీకి భర్త రాజ్‌తో పాటు సమంత కూడా సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Similar News

News February 3, 2026

పల్నాడు జిల్లాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

<>AP: <<>>పల్నాడు DHMOలో 18 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBBS, డిప్లొమా/MD/PSM, డిగ్రీ, PG, MBA/PGD, BCom, BSc(సైన్స్), DMLT, శానిటరీ ఇన్‌స్పెక్టర్స్ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, BCలకు రూ.300. వెబ్‌సైట్: https://palnadu.ap.gov.in

News February 3, 2026

రూ.20 వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

image

వెండి ధరల పతనం కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి ధర రూ.20 వేలు తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.2,80,000 పలుకుతోంది. కాగా 4 రోజుల్లోనే వెండి ధర రూ.1.25 లక్షలు తగ్గింది. ఇది ఇన్వెస్టర్లకు బ్యాడ్ న్యూసే అయినా.. శుభకార్యాల ముందు <<19036596>>బంగారం<<>>, వెండి ధరలు పడిపోవడం సామాన్యుడికి శుభవార్తే.

News February 3, 2026

‘CM బ్రేక్‌ ఫాస్ట్‌’కు రూ.500కోట్ల ప్రపోజల్స్

image

TG: చీఫ్ మినిస్టర్ బ్రేక్‌‌ఫాస్ట్‌ స్కీమ్‌కు రూ.500 కోట్లు కేటాయించాలని ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రపోజల్స్ పంపించింది. మిడ్ డే మీల్స్ కోసం రూ.600 కోట్లు ఇవ్వాలని కోరింది. గతేడాది రూ.530 కోట్లు ఖర్చయిందని, గుడ్ల ధరలు పెరిగినందున ఎస్టిమేషన్స్ పెంచుతూ అధికారులు ప్రపోజల్స్ రెడీ చేసి పంపించారు. రాష్ట్రంలోని దాదాపు 28వేల స్కూల్స్‌లో ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.