News March 4, 2025
భర్త ప్రోత్సాహంతో ఎస్సై ఉద్యోగం

టీ.నర్సాపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన పరసా రాధిక తన భర్త ప్రోత్సాహంతో ఎస్ఐ ఉద్యోగం సాధించారు. పెళ్లై 10 సంవత్సరాలైందని, భర్త ధర్మరాజు తనకు చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించి ఎంతగానో ప్రోత్సహించారని, అందుకే ఉద్యోగం సాధించగలిగానని రాధిక తెలిపారు. భర్త గంధం ధర్మరాజు బీటెక్ చదివి సొంత ఊర్లోనే వ్యవసాయం, తేనెటీగల పరిశ్రమ నడుపుతున్నారు. రాధిక దంపతుల కుమారుడు నోయల్ మూడవ తరగతి చదువుతున్నాడు.
Similar News
News April 13, 2026
PHOTO: కండలు తిరిగిన శరీరంతో Jr.NTR

‘డ్రాగన్’ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ కండలు తిరిగిన బాడీ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది క్షణాల్లోనే వైరలైంది. తారక్ బాడీ బాక్సాఫీస్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
News April 13, 2026
చర్చలు విఫలం.. మార్కెట్లలో బ్లడ్‌బాతేనా?

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, క్రూడాయిల్ ధర పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. యుద్ధం ఇంకా కొనసాగనుండటంతో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జపాన్ నిక్కీ-225.. 0.80%, టోపిక్స్ 0.42% నష్టపోయాయి. సౌత్ కొరియా కోప్సి 1.83%, కొస్దాక్ 1.43%, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్, ఆస్ట్రేలియా S&P/ASX 200 మైనస్‌లో ట్రెండ్ అవుతున్నాయి.
News April 13, 2026
తుంగభద్ర డ్యాం: మే చివరినాటికి పనులన్నీ పూర్తి

తుంగభద్ర జలాశయం 33 కొత్త గేట్లతో సరికొత్త రూపు సంతరించుకుంటోంది. దశాబ్దాల కాలం నాటి పాత గేట్ల స్థానంలో రూ.47 కోట్లతో ఆధునిక గేట్లను బిగిస్తున్నారు. ఇప్పటికే 26 గేట్లు బిగించి, 22 గేట్లకు ట్రయల్ రన్ పూర్తి చేశారు. వచ్చే ఖరీఫ్ నుంచి జలాశయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. మే చివరి నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.


