News July 29, 2024
భర్త మోసం చేశాడని అత్తింటి ముందు నిరసన
తనతో అప్పులు చేయించి భర్త మోసం చేశాడంటూ విశాఖపట్నంకు చెందిన అచ్యుతాంబ ఆదివారం ఆరోపించారు. కాకినాడ అర్బన్ జగన్నాథపురం ముత్తానగర్లో భర్త ఇంటి ముందు నిరసన చేపట్టారు. ముత్తానగర్కు చెందిన జయరాజు 2019లో తనను వివాహం చేసుకున్నారన్నారు. వ్యాపారం కోసం విశాఖలో పలువురి నుంచి రూ.28 లక్షలు తన ద్వారా అప్పుగా తీసుకున్నారని, 20 కాసుల బంగారం తాకట్టుపెట్టి రూ.10 లక్షలు ఇవ్వగా, తనను మోసం చేశాడని వాపోయారు.
Similar News
News November 25, 2024
ఫీజు రీయంబర్స్మెంట్ను వారికే నేరుగా వేస్తాం: కలెక్టర్
ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయంబర్స్మెంట్ను విద్యా సంస్థలకే నేరుగా విడుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు మేరకు త్వరలోనే ఈ ఏడాదికి సంబంధించిన మొత్తం మంజూరు చేస్తామని, దశల వారీగా బకాయిలు సైతం విడుదల చేయడం జరుగుతుందని, ఈ నేపథ్యంలో కలెక్టర్ స్పష్టమైన హామీనిస్తూ ఆ ప్రకటనలో తెలిపారు.
News November 25, 2024
రాజమండ్రిలో వ్యభిచారం.. యువతుల అరెస్ట్
స్పా సెంటర్ మాటున వ్యభిచారం చేయడం రాజమండ్రిలో కలకలం రేపింది. తాడితోటలో సతీశ్, లక్ష్మి బ్యూటీ సెలూన్ షాపు నిర్వహిస్తున్నారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వన్ టౌన్ పోలీసులు ఆదివారం రాత్రి దాడి చేశారు. అక్కడ మసాజ్ చేస్తున్న ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ షాపును సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు సీఐ మురళీకృష్ణ తెలిపారు.
News November 25, 2024
రేపు యథావిధిగా పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం: కలెక్టర్ ప్రశాంతి
సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి. ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల నుంచి అర్జీలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, రెవెన్యు డివిజనల్, మునిసిపల్, మండలస్థాయిలో అధికారులు తీసుకుని త్వరతగతిన పరిష్కారిస్తారని ఆమె తెలిపారు.