News February 14, 2025

భర్త వేధింపులకు నవ వధువు ఆత్మహత్య

image

గోపాలపట్నంలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. నాగేంద్రబాబు, వసంత 11 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పోర్న్‌ వీడియోలకు బానిసైన నాగేంద్ర భార్య వసంతను అదేవిధంగా చేయాలని ఒత్తిడి చేసేవాడు. దీంతో మనస్తాపానికి గురైన వసంత శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకుని నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని KGHకి తరలించారు.

Similar News

News January 8, 2026

కార్పొరేషన్‌పై ఎమ్మెల్సీ సారయ్య అలక..!

image

మొన్నటి వరకు వరంగల్ పోలీసులపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య.. ఇప్పుడు వరంగల్ కార్పొరేషన్‌‌పై ఫైర్ అవుతున్నారు. తమను కార్పొరేషన్ సమావేశానికి మాత్రమే పిలుస్తున్నారని, అభివృద్ధి కార్యక్రమాలకు పిలువడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మునిసిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు.

News January 8, 2026

వంటింటి చిట్కాలు

image

* నిమ్మజాతి పండ్లు, టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదు.
* వంటింట్లో వాడే స్పాంజిలూ, మసి బట్టల్ని ఉప్పు వేసిన చన్నీళ్ళలో కాసేపు నానబెట్టి తరువాత ఉతకండి. క్రిములు పోతాయి. దుర్వాసన కూడా ఉండదు.
* పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే పాత్రలు నీచు వాసన రావు.
* తేనె ముద్దగా అయితే, కాసేపు అది ఉన్న సీసాను వేణ్ణీళ్ళలో ఉంచితే సరిపోతుంది.

News January 8, 2026

KNR: సంక్రాంతి స్పెషల్.. HYD నుంచి కాగజ్‌నగర్‌కు ప్రత్యేక రైలు

image

సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌-కాగజ్‌నగర్‌ మార్గంలో ఈనెల 9, 10, 18 తేదీల్లో ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలు ఉదయం 7:55కు హైదరాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం కాగజ్‌నగర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల తేదీల్లో మధ్యాహ్నం 3:15కు కాగజ్‌నగర్‌లో బయలుదేరుతుంది. ఉమ్మడి జిల్లాలోని ఉప్పల్, జమ్మికుంట, ఓదెల, పెద్దపల్లి, రామగుండం స్టేషన్‌లలో రైలు ఆగుతుంది.