News April 22, 2024
భవనంపై నుంచి పడి శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

భవనంపై నుంచి పడి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దిల్లేశ్వర్ రహ్మత్ నగర్‌లో ఉంటూ కూలీ పని చేసేవాడు. ఆదివారం సంజయ్ నగర్ బస్తీలోని నాల్గో అంతస్తులో పని చేస్తుండగా పైనుంచి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.
Similar News
News April 21, 2025
రణస్థలం: రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు

రణస్థలం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గొర్లె పేట గ్రామంలో గంట్యాడ రమణ అనే వ్యక్తి రోడ్డుకు అడ్డంగా గోడ కట్టాడు. దీంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఇలా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టడంతో రాకపోకలు అంతరాయం కలిగింది. ఈ గోడ కట్టడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గ్రామంలోని పలువురు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News April 21, 2025
శ్రీకాకుళం జిల్లాలో టీచర్ పోస్టులు ఇలా..!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో డీఎస్సీ ద్వారా 458 పోస్టులు భర్తీ చేయనున్న విషయం తెలిసిందే. రోస్టర్ వారీగా పోస్టులు ఇలా కేటాయిస్తారు. ➤ OC-184 ➤ BC-A:35 ➤ BC-B:41 ➤ BC-C:6 ➤ BC-D:32 ➤ BC-E:20 ➤ SC- గ్రేడ్1:8 ➤ SC-గ్రేడ్2:27➤ SC-గ్రేడ్3:36 ➤ ST:25 ➤ EWS:44.
News April 21, 2025
నౌపడ: కోడిపందాలు కేసులో ఐదుగురి అరెస్ట్

సంతబొమ్మాళి మండలం మర్రిపాడులో కోడిపందాలు ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన దాడుల్లో భాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పందెంకి వినియోగించిన సామగ్రి తో పాటు రూ. 3,210 నగదును స్వాధీనం చేసుకున్నారు. నౌపడ సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి కేసు నమోదు చేశారు.