News November 5, 2025
భవనం రగడ.. ఎమ్మెల్యే VS మాజీ ఎమ్మెల్యే

మణుగూరు ఓ భవనం పేటెంట్ హక్కు తమదంటే తమదంటూ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య రాజుకున్న వివాదం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీని పెంచి పోషించిన కాంగ్రెస్‌నే మాజీ MLA రేగా కాంతారావు ముంచారంటూ MLA పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. జిల్లాలో రూ.కోట్ల నిధులు పక్కదారి పట్టాయని తాను అడగడంతో, ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే MLA, ఇద్దరు మంత్రులు వివాదాన్ని తెరమీదకు తెచ్చారని రేగా ఎదురుదాడికి దిగారు.
Similar News
News November 5, 2025
సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సమర్థవంతంగా పనిచేసే క్యాన్సర్ ఔషధం!

నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ (US) సైంటిస్టులు కీమోథెరపీ ఔషధాన్ని నానోటెక్నాలజీతో పునఃరూపకల్పన చేసి క్యాన్సర్ చికిత్సలో పెనుమార్పు తీసుకొచ్చారు. దుష్ప్రభావాలు కలిగించే 5-ఫ్లోరోయురాసిల్ (5-Fu) ఔషధాన్ని, స్ఫెరికల్ న్యూక్లియిక్ యాసిడ్ (SNA)గా మార్చారు. ఇది లుకేమియా కణాలను 20,000 రెట్లు ప్రభావవంతంగా నాశనం చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన కణజాలానికి హాని చేయకుండా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుంటుంది.
News November 5, 2025
అమ్రాబాద్: ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

అమ్రాబాద్ మండలంలోని వటవర్లపల్లి సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అక్కమహాదేవి మలుపు వద్ద అతివేగంగా అదుపుతప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి ప్రయాణికులను బయటపడ్డారు. బస్సు రోడ్డుపై అడ్డుగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయినట్లు ప్రయాణికులు తెలిపారు.
News November 5, 2025
కోతుల మధ్య కూర్చుంటే యోగిని ఎవరూ గుర్తించరు: అఖిలేశ్

బిహార్ ప్రచారంలో UP CM యోగి ఆదిత్యనాథ్ ‘మూడు కోతుల’ వ్యాఖ్యలకు SP చీఫ్ అఖిలేశ్ కౌంటరిచ్చారు. ‘ముఖ్యమైన సమస్యల నుంచి ప్రజలను దారిమళ్లించడానికి BJP 3 కోతుల సిద్ధాంతాన్ని గుర్తుచేసుకుంటోంది. నిజానికి ఆదిత్యనాథ్ కోతుల గుంపులో కూర్చుంటే ఆయనను ఎవరూ గుర్తుపట్టలేరు’ అని ఎద్దేవా చేశారు. రాహుల్, తేజస్వి, అఖిలేశ్‌లను యోగి 3 కోతులతో పోల్చి <<18187731>>విమర్శించిన<<>> విషయం తెలిసిందే.


