News April 3, 2025
భవన నిర్మాణ కార్మికులకు తంబు రద్దు చేయాలి: AITUC

భవన నిర్మాణ కార్మికులకు తంబు విధానాన్ని రద్దు చేసి, నిర్మాణ రంగంలో పనిచేస్తూ 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని(AITUC) తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేటలోని శ్రామిక భవన్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం 2వ మహాసభలో పాల్గొని మాట్లాడారు.
Similar News
News April 4, 2025
తమిళనాడు సర్కారుకు షాక్.. నీట్ మినహాయింపు బిల్లు తిరస్కరణ

తమిళనాడు ప్రభుత్వానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము షాక్ ఇచ్చారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలన్న బిల్లును తిరస్కరించారు. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ అసెంబ్లీలో వెల్లడించారు. కేంద్రంపై తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. NEET నుంచి తమ రాష్ట్రాన్ని మినహాయించాలని తమిళనాడు అసెంబ్లీ గతేడాది జూన్‌లో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.
News April 4, 2025
బాబు వచ్చాక ఆదాయం తగ్గింది: వైసీపీ

AP: చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ నేల చూపులు చూస్తోందని వైసీపీ విమర్శించింది. ‘జగన్ హయాంతో పోలిస్తే నేడు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 2023-24లో రూ.9,600కోట్లు రాగా, 2024-25లో రూ.8,800కోట్లకు పడిపోయింది. అది రాబట్టడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు’ అని ట్వీట్ చేసింది.
News April 4, 2025
అంబాజీపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

అంబాజీపేట మండలం గంగలకుర్రు ప్రాథమిక పాఠశాల వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ స్కూటీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఒకరు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.