News November 17, 2025
భవాని దీక్షల విరమణకు ప్రత్యేక ఏర్పాట్లు: ఈవో

భవాని దీక్షల విరమణ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై సోమవారం ఉదయం ఇంద్రకీలాద్రిపై ఆలయ అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ ఈ సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబర్ 4న జరిగే కలశ జ్యోతి ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీక్షా విరమణ సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఈవో సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News November 17, 2025
NGKL: ప్రజావాణికి 48 ఫిర్యాదులు

నాగర్‌కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 48 దరఖాస్తులు అందినట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రకటించారు. అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవసహాయంతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు అందరూ తమ పరిధిలో వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
News November 17, 2025
సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు ₹5 లక్షల పరిహారం

TG: సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున పరిహారం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. మంత్రి అజహరుద్దీన్, MIM MLA, మైనారిటీ విభాగం అధికారితో కూడిన ప్రతినిధుల బృందాన్ని ప్రభుత్వం సౌదీకి పంపించనుంది. మృతుల భౌతిక కాయాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు జరిపించనుంది. బాధిత కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను CM ఆదేశించారు.
News November 17, 2025
VZM: ‘నవంబర్ 30లోగా గృహాల సర్వే పూర్తి చేయాలి’

గృహాల కోసం దరఖాస్తులు చేసిన లబ్ధిదారులపై జరుగుతున్న సర్వేను నవంబర్ 30లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి సంబంధిత అధికారులకు సోమవారం ఆదేశించారు. ప్రభుత్వం గడువు నిర్ణయించినందున, ప్రతి అర్హత గల దరఖాస్తుదారుని వివరాలు సమగ్రంగా పరిశీలించి, ఎంపీడీవోలు యాప్‌లో వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేశారు. సర్వేలో పారదర్శకత, కచ్చితత్వం పాటించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.


