News December 19, 2024

భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల‌కు టెక్ తోడు: క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ

image

టెక్ తోడుగా భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఉండేందుకు ఈ యాప్‌ను అందుబాటులో ఉంచిన‌ట్లు క‌లెక్ట‌ర్ జి.ల‌క్ష్మీశ తెలిపారు. బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన స‌మ‌న్వ‌య శాఖ‌ల స‌మావేశంలో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. పోలీస్ క‌మిష‌న‌ర్ ఎస్‌వీ రాజ‌శేఖ‌ర బాబుతో క‌లిసి యాప్‌ను ప‌రిశీలించారు. భ‌క్తుల‌కు మ‌రింత సౌక‌ర్యంగా ఉండేలా చేయాల్సిన మార్పుల‌పై క‌లెక్ట‌ర్ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. 

Similar News

News November 8, 2025

కృష్ణా: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

image

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి తన నంబర్‌పై కేసు నమోదైందని బెదిరించి రూ. 14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులు కృష్ణా జిల్లా పెడనకి చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్‌ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు.

News November 8, 2025

మచిలీపట్నం: కలెక్టరేట్‌లో భక్త కనకదాసు జయంతి

image

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఉదయం కలెక్టరేట్ మీటింగ్ హాలులో భక్త కనకదాసు జ‌యంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కురుబ గౌడ దాస సమాజానికి ఆరాధ్య దైవంగా నిలిచిన భక్త కనకదాసు కర్ణాటకలోని గొప్ప భక్తుడు, ఆధునిక కవి, యోధుడు అని తెలిపారు.

News November 8, 2025

కోడూరు: కూలికి వెళ్లి అనంత లోకాలకు..!

image

వ్యవసాయ కూలి పనుల వెళ్లి విగత జీవిగా యువకుడు కాటికి చేరిన సంఘటన కోడూరు మండలం గొల్లపాలెం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓలేటి ఇంద్ర బాబు(27), ఇతర వ్యవసాయ కార్మికులతో ఇటీవల చిత్తూరు జిల్లా రేణిగుంట వ్యవసాయ కూలీ పనులకు వెళ్లాడు. శుక్రవారం వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో కరెంటు షాక్ గురై అక్కడకక్కడే మృతి చెందాడని ఇంద్రబాబు కుటుంబ సభ్యులు తెలిపారు.