News March 21, 2025

భాగస్వామికి దూరంగా ఉంటున్నారా?

image

ఒత్తిళ్లో, ఆర్థిక ఒడిదుడుకులో, అనారోగ్యాలో.. కారణాలేవైనా ఎన్నో జంటలు తమ రోజువారీ జీవితంలో దాంపత్య సుఖానికి దూరంగా ఉంటుంటాయి. అది ఏమాత్రం మంచిది కాదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల ఉపయోగం లేకపోగా వారి మధ్య దూరం పెరిగి చికాకులు తోడవుతాయని వివరిస్తున్నారు. ఎన్ని బాధలు ఉన్నా పడకపై భాగస్వామి చెంతచేరి సేదతీరాలని, మరుసటిరోజుకు ఇది కొత్త ఉత్సాహాన్నిస్తుందని సూచిస్తున్నారు.

Similar News

News March 22, 2025

రోహిత్‌లా విరాట్ రిస్క్ తీసుకోలేరు: ఫించ్

image

దూకుడుగా ఆడేందుకు రోహిత్‌కు ఉన్న అవకాశం విరాట్‌కు లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫించ్ అభిప్రాయపడ్డారు. టీమ్ పరిస్థితుల్ని బట్టి చూస్తే రోహిత్‌లా రిస్క్ తీసుకోలేరని పేర్కొన్నారు. ‘ముంబైలో రోహిత్‌ తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఆయన స్కోరు ప్రభావం చూపించదు. అందుకే శర్మ స్వేచ్ఛగా ఆడతారు. కానీ ఆర్సీబీ జట్టు విరాట్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన స్కోర్ చేస్తేనే జట్టుకు మంచి పునాది లభిస్తుంది’ అని విశ్లేషించారు.

News March 22, 2025

హైదరాబాద్‌లో భారీ వర్షం

image

TG: హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్ తో పాటు నగరంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో భారీగా గాలులు వీయడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో భారీ వర్షం పడిన సంగతి తెలిసిందే.

News March 22, 2025

మార్చి22: చరిత్రలో ఈరోజు

image

*1739: ఇరాన్ పాలకుడు నాదిర్ ‌షా ఢిల్లీని ఆక్రమించి నెమలి సింహాసనం అపహరించాడు
*2000: భారత కృత్తిమ ఉపగ్రహం ఇన్‌శాట్-3బి ప్రయోగం విజయవంతం
*2005: తమిళ నటుడు జెమినీ గణేశన్ మరణం
*2007: తత్వవేత్త ఉప్పులూరి గోపాలకృష్ణ మరణం
*2009: తెలుగు సినీ నటుడు టి.ఎల్.కాంతారావు మరణం
ప్రపంచ జల దినోత్సవం

error: Content is protected !!