News October 12, 2025
భాగస్వామ్య సదస్సుకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దండి: మేయర్

విశాఖ వేదికగా జరుగనున్న భాగస్వామ్య సదస్సుకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని మేయర్ పీలా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. శనివారం తాటిచెట్లపాలెం, న్యూకాలనీ రోడ్డు, తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పలు సెంటర్లలో కొత్త మొక్కలను ఏర్పాటు చేయాలని సూచించారు. అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలను చేపట్టాలని మేయర్ ఆదేశించారు.
Similar News
News October 12, 2025
విశాఖలో టుడే టాప్ న్యూస్

➤ దువ్వాడ దొంగతనం కేసును చేధించిన పోలీసులు
➤ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, మేయర్
➤ కోటి సంతకాల ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరించిన కె.కె.రాజు
➤ రేపు విశాఖ రానున్న మంత్రి నారా లోకేశ్
➤ పీఎంపాలెంలో వివాహిత సూసైడ్
➤ కేజీహెచ్ నుంచి ఆరుగురు విద్యార్థులు డిశ్చార్జ్
➤ యాంటీ డ్రగ్ గ్లో థిమ్ పార్క్ ప్రారంభం
➤ విశాఖలో విజయవాడ రౌడీ షీటర్ హత్య
News October 12, 2025
విశాఖ: రౌడీ షీటర్‌ను చంపిన కేసులో నలుగురి అరెస్ట్

విజయవాడ రౌడీ షీటర్ శ్రీధర్‌ను చంపేసిన కేసులో నలుగురిని అరెస్ట్ చేశామని ఏసీపీ నరసింహమూర్తి తెలిపారు. రౌడీ షీటర్ శ్రీధర్ ఎలమంచిలి కోర్టుకు రాగా ఇక్కడ ఉంటున్న రౌడీ షీటర్ గౌరీశంకర్‌తో కలిసి విశాఖ వచ్చాడు. వీరితో పాటు మరో ఇద్దరు మద్యం తాగి శ్యామల అనే మహిళ ఇంటిలో గొడవపడ్డారు. ఈ గొడవలో శ్రీధర్‌ను గౌరీ శంకర్ కత్తితో పొడిచి పోలవరం కాలువలో పడేశాడు. దర్యాప్తులో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News October 11, 2025
పీఎంపాలెంలో వివాహిత సూసైడ్.. నోట్‌లో ఏముందంటే..!

పీఎంపాలెం పరిధిలో వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. భారతికి తన భర్త చనిపోయిన తర్వాత ఆటో డ్రైవర్ శ్రీనుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనికి ఆమె అత్త అడ్డుచెప్పి ఇంటి నుంచి వెళ్లిపోమనడంతో మనస్థాపం చెంది ఉరివేసుకుంది. తను చనిపోయానని ఎవరో ఒకరి సెల్ నుంచి అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్పు అని తన కుమారుడిని ఉద్ధేశించి సూసైడ్ నోట్‌లో రాసింది.