News October 16, 2025

భాగస్వామ్య సదస్సుపై జిల్లాలో అవగాహన: కలెక్టర్

image

విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు (ఇండస్ట్రీ పార్ట్‌నర్‌షిప్ డ్రైవ్) పోస్టర్‌ను కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి నవంబర్ 15 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సదస్సులో జిల్లా నుంచి ఎక్కువ మంది భాగస్వామ్యం అయ్యేలా కృషి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు.

Similar News

News October 15, 2025

మంగళగిరి: పోలీస్ అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన

image

దేశవ్యాప్తంగా అక్టోబర్ 21న నిర్వహించబోతున్న పోలీసు అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లను మంగళగిరి ఏపీఎస్‌పీ 6 బెటాలియన్‌లో ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం పరిశీలించారు. భద్రత, అమరవీరుల స్తూపం, స్టేజి నిర్మాణం, పరేడ్ స్థలాలను బెటాలియన్ ఇన్‌ఛార్జ్ కమాండెంట్ ఏ.మురళీ ఎస్పీకి వివరించారు. సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు.

News October 15, 2025

తెనాలిలో పెరుగుతున్న క్రైమ్ రేటు!(1/2)

image

ప్రశాంతంగా ఉంటున్న తెనాలిలో పరిస్థితి 3 మర్డర్లు..6 చోరీలు అన్నట్లుగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. గత 7 నెలల కాలంలో వేర్వేరు కారణాలతో ఏడుగురు హతమయ్యారు. చెంచుపేటలో ఇవాళ జరిగిన హత్య లాగానే కొన్ని నెలల క్రితం పండ్ల వ్యాపారిని దారుణంగా కత్తితో నరికి హత్య చేశారు. తర్వాత ముత్తింశెట్టిపాలెంలో మహిళ హత్య, పరిమి రోడ్డులో డబుల్ మర్డర్, పినపాడులో ఒకటి, వార్ఫ్ రోడ్డులో ఇంకో హత్య జరిగాయి.

News October 15, 2025

తెనాలిలో హెచ్చుమీరుతున్న నేరాలు…(2/2)

image

తెనాలి చెంచుపేటలో మంగళవారం పట్టపగలే హోటల్ వద్ద టిఫిన్ తింటున్న కోడితాడిపర్రుకు చెందిన జూటూరి తిరుపతిరావుని పాత కక్షలతో దారుణంగా హత్య చేశారు. ఇలా వరుస హత్యోదంతాలతో పాటు తరచూ జరుగుతున్న చోరీలు, కొట్లాటలు తెనాలి ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం రౌడీషీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మళ్లీ అదే తరహాలో నేర తీవ్రతను తగ్గించడానికి పోలీసులు నిఘా మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.