News February 18, 2026
‘భాగ్య’నగరంలో ఉద్యమించిన ధ్రువతార

అంబేడ్కర్ సన్నిహితుడు మన హైదరాబాదీ మాదరి భాగయ్య. అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక. కుల వివక్షను ప్రశ్నిస్తూ, సమాజంలో గౌరవ సూచకంగా భావించిన ‘రెడ్డి’, ‘వర్మ’లను తన పేరులో చేర్చుకుని భాగ్యరెడ్డి వర్మగా ప్రసిద్ధి చెందారు. దేవదాసీ వ్యవస్థ, నిజాం పాలనలో వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఆది హిందూ చైతన్యానికి బలమైన పునాదులు వేశారు. దళిత హక్కుల కోసం పోరాడి చరిత్రకెక్కారు.
#నేడు ఆయన వర్ధంతి.
Similar News
News February 20, 2026
రంజాన్ మాసంలో చార్మినార్‌కు కొత్త అందాలు

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో షాపింగ్ స్టాల్స్ సందడిగా మారాయి. హోల్ సేల్ వస్త్రాల మార్కెట్‌గా పేరుగాంచిన మదీనాతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలల్లో దుస్తులు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లతో షాపులకు రద్దీ పెరిగింది. చార్మినార్‌ను విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించారు.
News February 20, 2026
HYD: రోజుకు ₹70తో ఇవన్నీ సాధ్యమా?

అమీర్‌పేట్ సర్కార్ హోమ్లోని 505 మంది ఇన్‌మేట్స్ కోసం రూ.1.27CRతో మెనూ సిద్ధమైంది. ఆదివారం చికెన్, నిత్యం రాగిజావ, పల్లీలడ్లు, పండ్లు, గుడ్లు ఇవన్నీ రాజభోగంలా ఉన్నా.. నెలకు ఒక్కరికి కేటాయించింది ₹2,100 మాత్రమే. అంటే రోజుకు ₹70 అన్నమాట. దీంతో ఇది సాధ్యమేనా? అన్నది అసలు ప్రశ్న. గుడ్డు ₹6, పాలు లీటర్ ₹85- 90, గ్యాస్ దాదాపు ₹2వేలు సర్కార్ ఫిక్స్ చేసిన ₹70తో ఇవ్వన్నీ అందించడం కత్తిమీద సామే.